బొద్దుగా ఉండే హీరో, హీరోయిన్స్ స్లిమ్‌గా మారడానికి చాలా వర్కవుట్స్ చేయడంతో పాటు పర్టిక్యులర్ డైట్ తీసుకుంటున్నారు. 10 నుండి 15 కేజీల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్వకత్వంతో పాటు నిర్మాణంలో వచ్చిన పలు సినిమాలలో నటించిన హీరో ఫర్దీన్ ఖాన్ ఒకప్పుడు స్టార్ హీరోగా వరుస సినిమాలు చేశాడు. పదేళ్ళ పాటు ఆయన హవా ఓ రేంజ్‌లో సాగింది. 2010 తర్వాత ఆఫర్స్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.
సినిమాలు లేకపోవడంతో వర్కవుట్స్‌పై దృష్టి పెట్టకపోవడంతో ఫర్దీన్ ఖాన్ బాగా బరువు పెరిగి గుర్తు పట్టలేనట్టు మారాడు. ఆయనని ఎంతగానో అభిమానించే అభిమానులు కూడా ఫర్దీన్ ఖాన్‌ని గుర్తు పట్టలేకపోయారు. అయితే అంత భారీ ఖాయంతో కనిపించిన ఫర్దీన్ తిరిగి ఓల్డ్ లుక్‌లోకి మారడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఐదు పదుల వయస్సు ఉన్న వ్యక్తి 25 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తుండడంతో మళ్ళీ ఆయన సినిమాలలోకి రీఎంట్రీ ఇస్తారా అనే చర్చ నడుస్తుంది.
వచ్చే ఏడాది ఫర్దీన్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్‌గా రానున్నాడని ఓ టాక్ అయితే నడుస్తుంది. దర్శక నిర్మాతలు కూడా విలన్‌గా లేదంటే మంచి సపోర్టింగ్ క్యారెక్టర్‌గా ఫర్దీన్ ఖాన్ ని తమ సినిమాలో నటింపజేసేందుకు చర్చలు జరుపుతున్నారట. వర్మ- ఫర్దీన్ ఖాన్ కాంబినేషన్ అంటే అప్పట్లో సెన్సేషనే. మరి ఇప్పుడు తిరిగి వీరద్దరు సందడి చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.