Bollywood : బాలీవుడ్ హీరోల బాడీగార్డ్ జీతాలు చూస్తే షాక్ అవుతారు..?

Bollywood: ఒకటి రెండు సినిమాలతో కొత్తగా సెలబ్రిటీ హోదా వచ్చిన హీరో హీరోయిన్స్ పబ్లిక్ ప్లాట్ ఫామ్ పనికి వస్తేనే అభిమానుల హడావుడి మామూలుగా ఉండదు. సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు అంటూ వారి చుట్టూ చేరిపోతారు. స్టార్ హోదా ఉన్న హీరో హీరోయిన్స్ అభిమానుల మధ్య వచ్చారంటే వారి ఆనందానికి హద్దులు ఉండవు. స్టార్ హీరో హీరోయిన్లు పబ్లిక్ ప్లాట్ ఫామ్ కి వస్తున్నారు అని తెలియగానే చుట్టుపక్కల ఊళ్ల నుంచి కూడా జనం బారులు తిరుగుతుంటారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ అని, ఇంకా ఏవైనా ఇతర కార్యక్రమాలకు ముఖ్యంగా సినిమాల్లో తమ అందచందాలతో అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్లు వస్తే.. ఇక జనాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు.  ఇలా హీరోహీరోయిన్ల ప్రతిక్షణం కాపాడేందుకు వారి చుట్టూ సెక్యూరిటీ వలయం లా బాడీగార్డులు ఉంటారు.

జన సందోహం లో అభిమానుల సెల్ఫీల నుంచి హీరో హీరోయిన్లను కాపాడేది ఈ బాడీగార్డ్ నే. ఇలాంటి బాడీగార్డ్ ల కోసం హీరోహీరోయిన్లు శాలరీ కూడా బాగానే ఆఫర్ చేస్తుంటారు.అటు రాజకీయ వ్యవస్థలోనూ బాడీగార్డ్‌ ల సంస్కృతి వచ్చింది. దాంతో.. కొంతమంది హీరోలకు హీరోయిన్లకు మంచి బాడీగార్డ్‌ లు దొరకని పరిస్థితి కూడా ఉంది.తాజాగా బాలీవుడ్‌ లోని హీరోహీరోయిన్ల బాడిగార్డ్స్‌ జీతాలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యింది.

మరి బాలీవుడ్ హీరోహీరోయిన్లలో బాడీగార్డ్స్‌ కోసం ఏడాదికి ఎవరు ఎక్కువ శాలరీస్‌ ఇస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరో చూద్దాం.
1. స్టార్ హీరో షారుక్‌ ఖాన్ తన బాడీగార్డ్ రవి సింగ్ కి ఏడాదికి 2.6 కోట్లు ఇస్తున్నాడు.

2. అమీర్‌ ఖాన్‌ తన బాడీగార్డ్ యువరాజ్‌ గోర్పడే కి 2 కోట్లు ఇస్తున్నాడు.

3. అమితాబ్‌ బచ్చన్ తన బాడీగార్డ్ జితేందర్ షిండే కి 1.5 కోట్లు ఇస్తున్నాడు.

4. సల్మాన్‌ ఖాన్‌ తన బాడీగార్డ్ షెరా 2 కోట్లు ఇస్తున్నాడు.

5. అక్షయ్‌ కుమార్‌ తన బాడీగార్డ్ శ్రేయసే తేలే కి 1.20 కోట్లు ఇస్తున్నాడు.

6. కంగనా రనౌత్‌ తన బాడీగార్డ్ కుమార్‌ కి 90 లక్షలు ఇస్తోంది.

7. దీపికా పదుకొణె తన బాడీగార్డ్ జలాల్‌ కి కోటి ఇస్తోంది.

8. కత్రీనా కైఫ్ తన బాడీగార్డ్ దీపక్ సింగ్‌ కి కోటి ఇస్తోంది.

9. అనుష్క శర్మ తన బాడీగార్డ్ ప్రకాష్‌ సింగ్‌ కి 1.2 కోట్లు ఇస్తోంది.