Onion: ఉల్లిపాయపై నలుపు మచ్చలు ఉంటే.. తినొచ్చా.. తినకూడదా..?

మన వంటకాలలో ఉల్లిపాయకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. చిన్న నుండి పెద్దవారు వరకు అందరూ ఉల్లిపాయను తింటుంటారు. ఇక “ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు” అని చెప్పుకుంటూ వచ్చారు. రుచికి, ఆరోగ్యానికి ఉపయుక్తమైన ఈ కూరగాయ లేకుండా దాదాపుగా ఏ వంటకమైనా అసంపూర్ణమే అన్నది అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఒక విషయం తెగ చక్కర్లు కొడుతోంది. అది ఉల్లిపాయల గురించి కావడం విశేషం.

ఇప్పుడు చాలా మంది గృహిణులు ఉల్లిపాయ తొలగిస్తుంటే లోపల బూడిదలా నలుపు మచ్చలు, పొరలు లేదా బురసి దూరినట్టు పదార్థాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితిలో కొందరు ఆ బాగం తీసేసి మిగతా ఉల్లి వాడేస్తుంటే, మరికొందరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా నేరుగా ఉల్లిపాయను పారేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో చాలా మంది ఇది తినొచ్చా? కడిగితే సరిపోతుందా? ఏమైనా ప్రమాదమా? అనే డౌట్స్‌లో పడుతున్నారు.

వైద్య నిపుణుల ప్రకారం, నల్లటి మసితో కూడిన ఉల్లిపాయ వాడటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ బూజు హానికరమైన ఫంగస్, బాక్టీరియా ఉండే అవకాశం ఎక్కువ. అలాంటి ఉల్లి వాడితే జీర్ణక్రియ సమస్యలు, వాంతులు, విరేచనాలు, చర్మ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, అలెర్జీ సమస్యలున్నవారు దీని ప్రభావానికి ఎక్కువగా లోనవుతారు.

అందుకే ఇలాంటి ఉల్లిపాయను కడిగితే సరిపోతుందనుకోవడం పొరపాటు. బురసి లోపల దూరి ఉంటే అది పూర్తిగా తొలగించలేం. కనుక ఇలాంటి ఉల్లి భాగాలను వాడకుండా నేరుగా పారేసేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒక్కో నల్లటి మచ్చలున్నఉల్లిపాయ వదిలిపెట్టి పెట్టడం వల్ల అది పక్కనున్న ఇతర ఉల్లిపాయలకూ వ్యాపించే అవకాశం ఉంది. కనుక పాడైన ఉల్లిపాయను వెంటనే వేరుచేయడం అలవాటు చేసుకోవాలి.

ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చల్లని ప్రదేశంలో, గాలి ఆడేలా, పొడి వాతావరణంలో ఉంచడం అత్యంత అవసరం. తడి, వర్షం, గాలి జారడం లాంటి పరిస్థితులు ఉంటే ఉల్లిపాయలపై నల్లగా మారే అవకాశం ఉంది. అప్పుడు వాటిని ఉపయోగించక తప్పదు. కాబట్టి కొద్దిగా ఖరీదు ఎక్కువైనా సరే మంచి నాణ్యత గల ఉల్లిపాయలే కొనాలి. ఇక ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రమే మన వంటకాలు రుచిగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఉల్లి మనకు చేయగల మేలు నిజమే… కానీ అదే సమయంలో అది పాడై ఉంటే మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.