విశ్వక్ సేన్ సినిమాకి అంత సీనుందా? “RRR”, “కేజీఎఫ్” క్రూ ని పట్టుకొస్తున్నారు..!

ప్రతి జెనరేషన్ లో కూడా యూత్ ను ఆకట్టుకునే హీరోలు వాస్తు ఉంటారు.. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ టాలీవుడ్ జెనరేషన్ లో కూడా కొందరు యంగ్ హీరోలు యూత్ ని తమ వైపు తిప్పుకున్న వారు ఉన్నారు. అలనాటి వారిలో అయితే మొదట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఉండగా మరొక హీరో మాత్రం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అనే చెప్పాలి. ఈ ఇద్దరు కూడా సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.

ఇక సినిమాల లైనప్ విషయానికి వస్తే మాత్రం ఒకింత విజయ్ కన్నా విశ్వక్ సేన్ లైనప్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలా రీసెంట్ గా అయితే ఏకంగా ఊహించని కాంబోని అనౌన్స్ చేసాడు. ప్రముఖ సీనియర్ స్టార్ నటుడు ఏక్షన్ కింగ్ అర్జున్ మొట్టమొదటి సారి దర్శకునిగా విశ్వక్ సేన్ ని హీరోగా పెట్టి ఓ సినిమాని అనౌన్స్ చేశారు.

దీనితో ఈ సరికొత్త కాంబోనే షాకింగ్ అనుకుంటే ఇప్పుడు దానికి మించిన షాక్ మీద షాక్ లు బిగ్ అనౌన్సమెంట్స్ తో ఇస్తున్నారు. నిన్ననే ఈ సినిమాకి ప్రముఖ మాటల రచయిత RRR కి రాసిన సాయి మాధవ్ బుర్రా ఆన్ బోర్డు లోకి వచ్చినట్టుగా అనౌన్స్ చేయగా ఈరోజు ఇంకో బిగ్ అనౌన్సమెంట్ ఇచ్చారు.

ఈసారి ఏకంగా కేజీఎఫ్ సినిమాలకి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసృర్ ని ఈ సినిమాకి సంగీతం కోసం తీసుకొచ్చారు. ఇవన్నీ చూస్తుంటే విశ్వక్ సేన్ 11వ సినిమాని భారీ స్థాయి ప్లానింగ్ లోనే చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి అనౌన్సమెంట్ లు వస్తాయో చూడాల్సిందే.