Home News బిగ్ బాస్‌4: అభిజిత్‌పై కాజల్ విమర్శల వర్షం... పెయిడ్ మీడియాదే సపోర్ట్ అంటూ ఫైర్

బిగ్ బాస్‌4: అభిజిత్‌పై కాజల్ విమర్శల వర్షం… పెయిడ్ మీడియాదే సపోర్ట్ అంటూ ఫైర్

బిగ్ బాస్ షో తెలుగు షో సీజన్ 4 ఎండింగ్ కి వచ్చిన నేపథ్యంలో మంచి రసవత్తరంగా మారింది. ఇంట్లో పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి. బయట కూడా జనాలు కంటెస్టెంట్ల వైజ్ చీలిపోయారు. మా వాడు గొప్ప అంటే, మా వోడు గొప్ప అని సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. యాంటీ ట్రెండ్స్, మీమ్స్, పబ్లిక్ రివ్యూస్ అన్ని పెరిగిపోయాయి. బిగ్ బాస్ షోను ఫాలో అవ్వని వారు కూడా ట్రోల్స్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా రేడీయో జాకీ ఆర్జే కాజల్ బిగ్ బాస్ నాల్గో సీజన్‌కు రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది.

Who Is Favourite Contestant Of Nagarjuna In Bigg Boss House

బిగ్ బాస్ విశ్లేసిస్తూ.. చేస్తూ కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది ఆర్జే కాజల్. అందులో కొందరు కంటెస్టెంట్లపై తన మార్క్ పంచులు వేస్తుంది. తాజాగా ఆర్జే ఈమె పబ్లిక్ ఫేవరెట్‌గా ఉన్న అభిజీత్‌ను టార్గెట్ చేసింది. అతడిపై పలు నెగటివ్ కామెంట్స్ చేసింది. దీంతో కాజల్ చేసిన పోస్ట్‌ను అఖిల్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అభిజిత్‌కు నామినేట్ ఇంట్రస్ట్ అని..అతడు ఒక్క పాయింట్ మాత్రమే చెప్పి సైలెంట్ అవుతాడని, ఎక్కువ సార్లు నామినేట్ అయ్యి సానుభూతి పొందేందుకు రెడీగా ఉంటాడని పలు సంచలన కామెంట్స్ చేసింది ఆర్జే కాజల్. అతను మార్నింగ్ డ్యాన్సులు చేయడని.. సరదాగా జరిగే చర్చల్లో పాల్గొనడంటూ విమర్శలు చేసింది. ప్రమోషనల్ టాస్కుల్లో కూడా అతడు పాల్గొనడని, ఫిజికల్ టాస్కులంటే ఆమడదూరం ఉరుకుతాడని ఏకిపారేసింది. అంతేనా ఇతరులతో కలిసిపోవడం వంటివి ఉండవని, వినోదం కూడా పంచడని తెలిపింది. వీటిన్నింటికి తోడు సెల్ఫ్ రెస్పెక్ట్ పేరుతో బిగ్ బాస్‌నే ఛాలెంజ్ చేస్తాడని పేర్కొంది.

Kajal Cmnts 1 | Telugu Rajyam

జనాలు అతడికి ఎందుకు ఓట్లు వేస్తున్నారో అర్థం కావట్లేదని.. అతనిలో ఉన్న నెగటివ్ పాయింట్స్‌ను పాజిటివ్‌గా మార్చేస్తున్న పెయిడ్ మీడియాకు కుడోస్ అంటూ ఆర్జే కాజల్ నెటిజన్లపై కూడా ఫైరయ్యింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో కొందరు ఆర్జే కాజల్ ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు ఫేమస్ అవ్వడానికి ఆమె ఇలా చేసిందని తిట్ల దండకం అందుకున్నారు.

- Advertisement -

Related Posts

ప్ర‌భాస్ ఖాతాలో ఫాస్టెస్ట్ రికార్డ్‌.. అతి త‌క్కువ టైంలో ఆరు మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సొంతం

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ ఛ‌త్ర‌ప‌తి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో ప్ర‌భాస్ న‌ట‌న‌, ఆయ‌న నోటి నుండి వెలువ‌డిన డైలాగులు ప్రేక్ష‌కుల‌ని...

జాతీయ జెండాను ఆవిష్క‌రించిన చిరంజీవి.. జెండా పండుగ వేడుక‌లో పాల్గొన్న‌ మెగా ఫ్యామిలీ

72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు దేశవ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు సంప్ర‌దాయ దుస్తులు ధరించి ఉద‌యాన్నే జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌ను స్థాపించిన చిరంజీవి బ్ల‌డ్...

‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ .. సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ !

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్...

ప్రాంతీయ స‌మాన‌త‌ల కోసం మూడు రాజ‌ధానులు అవసరం : ఏపీ గ‌వ‌ర్న‌ర్

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌ త్రివర్ణ...

Latest News