బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో కొన్ని రొమాంటిక్ జంటలు పుడుతూనే ఉన్నాయి. టీఆర్పీ రేటింగ్ పెరిగేందుకు ఇది కూడా దోహద పడుతుందని భావిస్తున్న నిర్వాహకులు టెలికాస్ట్ సమయంలో ఎక్కువ శాతం వీటికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ సీజన్‌లో డే 1 నుండి అఖిల్- మోనాల్‌ల రొమాంటిక్ ప్రేమ నాన్‌స్టాప్‌గా కొనసాగింది. అసలు అభిజీత్ ముందు మోనాల్‌ని లైన్‌లో పెట్టాలని ప్రయత్నంచినప్పటికి అది వర్కవుట్ కాకపోవడంతో మెల్లగా సైడ్ తీసుకొని హారికతో పులిహోర కలపడం మొదలు పెట్టాడు. హగ్‌లు, త్యాగాలు, ప్రేమ ఒలకబోయడాలు.. అబ్బో ఒకటా రెండా వీరి మధ్య మాములు విషయం నడవలేదు.
గేమ్ విషయంలోను అభిజీత్, హారిక చాలా అండర్‌స్టాండింగ్‌తో ఆడుతూ వచ్చి చివరకు ఈ ఇద్దరు టాప్ 5లో నిలిచారు. ఈ వారం చివరిది కావడంతో ఎలాంటి నామినేషన్ ప్రక్రియ లేదు. దీంతో బిగ్‌బాస్ ఫైనలిస్టులతో ఓ ఆటాడించాడు. మీ ఐదుగురిలో ఎవరు విజేత అయ్యే ఛాన్స్ లేదని మీరు బావిస్తున్నారో వారి పేరు చెప్పాలని అన్నారు . దీంతో లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ హీరో హారిక పేరు చెప్పేశాడు. అనర్హురాలు అని అన్నాడు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో కాస్త సస్పెన్స్ క్రియేట్ చేయడంతో నెటిజన్స్ కు ఏం అర్ధం కావడం లేదు. హారిక వెళ్లిపోవడానికి అనర్హురాలు అన్నాడా లేదంటే విజేతగా నిలిచేందుకు అనర్హురాలు అని అన్నాడా అనే దానిపై క్లారిటీ లేదు
ఇక అఖిల్, హారిక.. టైటిల్ గెలిచేందుకు అరియానా అనర్హురాలని తమ అభిప్రాయం చెప్పగా, ఈ విషయాన్ని చాలా పాజిటివ్‌గా తీసుకుంది అరియానా. నేను స్ట్రాంగ్ కాబట్టే , మీ అందరి బుర్రలోకి దూరాను కాబట్టే నన్ను అనర్హురాలు అంటున్నారు. గేమర్‌ని నాకు అర్ధమైంది. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని అరియానా చెప్పుకొచ్చింది. నామినేషన్ లేవనే కాని ఏదో ఒక రకం టాస్క్ ఇస్తూ ఇంటి సభ్యుల మధ్య పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు బిగ్ బాస్..