బిగ్ బాస్ 4: మోనాల్ సోద‌రిని చంపుతామ‌ని బెదిరింపులు.. అభి ఫ్యాన్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మోనాల్

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతుంది. తెలుగులో అయితే మూడు సీజన్స్ స‌జావుగా పూర్తి చేసుకున్న ఈ షో మ‌రో నాలుగు రోజుల‌లో సీజ‌న్ 4ని కూడా విజ‌య‌వంతంగా పూర్తి చేసుకునేందుకు సిద్ద‌మైంది. అయితే నాలుగో సీజ‌న్‌లో ఎవ‌రు విన్న‌ర్, అతిథిగా ఎవ‌రు వ‌స్తున్నారు అని కొద్ది రోజులుగా చ‌ర్చ న‌డుస్తున్న క్ర‌మంలో గుజ‌రాతీ భామ మోనాల్ గ‌జ్జ‌ర్ .. అబిజీత్ ఫ్యాన్స్‌పై సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఫినాలేకు మూడు రోజుల ముందు మోనాల్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో అంతా షాక్ అవుతున్నారు.

బిగ్ బాస్ సీజ‌న్ 4లో మొద‌ట మోనాల్, అభిజీత్ చాలా రొమాంటిక్‌గా క‌నిపించారు. ఒక చోట చేరి గుస‌గుస‌లాడ‌డం, అర్ద‌రాత్రుల‌లోను ముచ్చ‌టిస్తుండ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య సంథింగ్ సంథింగ్ న‌డుస్తుంద‌ని అందరు అనుకున్నారు. కాని ఏమైందో ఏమో స‌డెన్‌గా అఖిల్ గూటిన చేరింది మోనాల్‌. దీంతో అభిజీత్ బ‌య‌ట‌కు ఈ విష‌యాన్ని చెప్పుకోలేక‌పోయిన లోలోప‌ల చాలా బాధ‌ప‌డుతూ ఆమె వెనుక గోతులు తవ్వే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ విష‌యంపై మోనాల్ సోద‌రి హేమాలి.. హౌస్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు అభిజిత్‌కు ఓ స‌ల‌హా ఇచ్చింది. వెన‌క కాకుండా మోనాల్‌తో నేరుగా మాట్లాడ‌మ‌ని అభికి చెప్పింది. దీంతో అభి ఫ్యాన్స్ మోనాల్‌తో పాటు హేమాలిని కూడా ట్రోల్స్ చేశారు.

రీసెంట్‌గా బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన మోనాల్ … జోర్దార్ సుజాత‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న‌పై జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించింది. ‘ఓ వీకెండ్‌లో డీప్ నెక్ డ్రెస్ వేసుకున్నాన‌ని ట్రోల్ చేశారు. ఆరోజు నా ఆరోగ్యం బాగోలేదు. త‌ల‌కు నూనెతో మేక‌ప్ లేకుండా అలాగే కూర్చున్నాను. క‌నీసం కూర్చోడానికి కూడా నాకు ఓపిక లేదు అని త‌న బాధ చెప్పుకుంది. అలానే హేమాలిపై జ‌రుగుతున్న ట్రోలింగ్ గురించి కూడా స్పందిస్తూ.. ఆమె అభీకి స‌ల‌హా ఇచ్చింది. ఆమె స్ట్రాంగ్‌గా చెప్పిందేమో కాని, చెడుగా ఏం చెప్ప‌లేదు అని పేర్కొంది. ఈ విష‌యం అడ్డం పెట్టుకొని నా సోద‌రిపై చీప్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను చంపుతామ‌ని బెదిరిస్తున్నారు. దీని వ‌ల‌న హేమాలి చాలా బాధ‌ప‌డింది. అందుకే దీనిని సీరియ‌స్‌గా తీసుకొని తాను అభీ ఫ్యాన్స్‌పై సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్లు పేర్కొంది మోనాల్.