Home News బిగ్ బాస్ -74వ రోజు: ఈ సీజన్లో హైలైట్ ఎపిసోడ్... అమ్మ ప్రేమ-అందర్నీ కలిపేసింది

బిగ్ బాస్ -74వ రోజు: ఈ సీజన్లో హైలైట్ ఎపిసోడ్… అమ్మ ప్రేమ-అందర్నీ కలిపేసింది

బాద్షా మూవీలోని బంతి పూల జానకీ.. జానకీ అంత సిగ్గు దేనికీ అనే పాటతో బుధవారం నాటి 74వ ఎపిసోడ్ ఎనర్జెటిక్కుగా ప్రారంభమైంది. హారిక, అరియానాలు పొట్టిపొట్టి బట్టలతో స్టెప్పులు వేస్తూ ఎప్పటిలాగే హీట్ పెంచేశారు. ఇక నేడు అఖిల్ బర్త్ డే కావడంతో సొహైల్ విషెష్ అందించాడు. అనంతరం అవినాష్ ఊరిస్తూ సొహైల్, హారికలు మటన్ లొట్టలేసుకుని లాగించేశారు. బిగ్ బాంబ్ వల్ల అవినాష్ నాన్ వెజ్‌కి దూరం కావడంతో అతన్ని ఊరిస్తూ మటన్ తిన్నాడు సొహైల్.బిగ్ బాస్ ఆదేశాల అనుసారం ఇంటి సభ్యుల్ని పవర్ సేవ్ మోడ్‌లో ఉంచి వాళ్ల పేరెంట్స్‌ని ఇంటిలోకి రప్పించారు బిగ్ బాస్. మొదటిగా అఖిల్ తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చింది. ఇంటి సభ్యులంతా కదల్లేని స్థితిలో ఉండగా.. అఖిల్ తల్లి బిగ్ బాస్ హౌస్‌లో కనిపిచడంతో బోరు బోరున ఏడ్చాడు అఖిల్.

Bigg Boss 74Th Episode Is Best For This Season
Emotions… Emotions

తర్వాత ఇంటి సభ్యుల్ని పవర్ సేవ్ మోడ్‌లో ఉంచి వాళ్ల పేరెంట్స్‌ని ఇంటిలోకి రప్పించారు బిగ్ బాస్. మొదటిగా అఖిల్ తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చింది. ఇంటి సభ్యులంతా కదల్లేని స్థితిలో ఉండగా.. అఖిల్, తల్లి బిగ్ బాస్ హౌస్‌లో కనిపిచడంతో బోరు బోరున ఏడ్చాడు అఖిల్. ఏడ్వద్దు నాన్నా.. నువ్ ఎక్కడో ఉన్నావ్.. చాలా మంది ప్రేమిస్తున్నారు.. టార్గెట్ రీచ్ అయ్యే వరకూ నవ్వుతూ ఉండు అంటూ సలహాలు ఇచ్చింది అఖిల్ తల్లి దుర్గ. మోనాల్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె నీ బెస్ట్ ఫ్రెండ్ బాగా సపోర్ట్ చేయమని అఖిల్‌కి చెప్పింది. ఇక బర్త్ డే నాడు నిన్ను చూడటం చాలా ఆనందంగా ఉందంటూ హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇక అభిజిత్‌తో గొడవల్ని ఇన్ డైరెక్ట్‌గా ప్రస్తావిస్తూ ఒకే ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది.. మంచిగా ఉండండి.. ఒక ఫ్యామిలీలా అని చెప్పింది. కాస్త అరవడం తగ్గించి.. నవ్వుతూ ఉండమని అఖిల్‌కి సలహాలిచ్చారు .

Harika Mother
harika mother

ఈ సీజన్లో కి ఈ ఎపిసోడ్ హైలైట్ అయితే ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ సీన్ సూపర్ హైలైట్ … బిగ్ బాస్ అభిమానులందరికి ఆనందాన్ని పంచింది. అఖిల్ అమ్మ గారు అభిజిత్ తో అఖిల్‌ నీ బ్రదర్ లాగ,తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. అప్పుడు సారీ ఆంటీ టాస్క్ పరంగా గొడవలు అవుతున్నాయ్ తప్పితే మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పాడు అభిజిత్. ఇక మిగిలిన ఇంటి సభ్యుల గురించి చక్కగా మాట్లాడారు ఆమె. తన కొడుకు టాప్ 5లో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది అఖిల్ తల్లి. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చే గొప్ప అవకాశం నీ వల్ల నాకు వచ్చింది అఖిల్ అంటూ తెగ ఆనందపడింది అఖిల్ తల్లి. అందర్నీ నవ్విస్తూ నవ్వుతూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు అఖిల్ తల్లి దుర్గ. అయితే ఆమె బయటకు వెళ్లిన తరువాత అఖిల్-అభిజిత్‌లు హగ్ చేసుకుని సరదాగా మాట్లాడుకున్నారు. గొడవ పడకూడదు అనుకుంటున్నాం కానీ.. కావడం లేదు.. చాలా బాధగా ఉందంటూ ఇద్దరూ ఒకర్నొకరు పట్టుకుని ఫీల్ కావడం ఈ ఇద్దరి ఫ్యాన్స్‌లో ఆనందం నింపింది. సోషల్ మీడియాలో అఖిల్ వర్సెస్ అభిజిత్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుండటంతో ఈ సీన్‌తో వాళ్లని శాంతింపచేశారు.

అవినాష్ వాళ్ల అమ్మగారు సూపర్ అంటే సూపరు. డాన్స్ చెయ్యమ్మా అని అవినాష్ అడగానే , చెయ్యానా అంటూ ఆవిడ నాలుగు స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. పెళ్లి పెళ్లి అని అంటున్నావుగా బిగ్ బాస్ నుండి బయటకి రాగానే చేస్తానని అనగానే అందరూ నవ్వుకున్నారు. అలానే ఇంటికొచ్చాక మటన్ కర్రీ చేసిపెడతాలే అని అనగానే అందరూ మేము కూడా వస్తాం అన్నారు. ఇక హారిక ఎంత అల్లరి పిల్లనో వాళ్ళ అమ్మ కూడా అంతే సరదాగా ఉంది హౌస్ లో. అలానే అభిజిత్ వాళ్ళమ్మగారు కూడా వచ్చి సందడి చేసి వెళ్లారు. ఇలా అమ్మలందరు వచ్చి తమ ప్రేమని పంచి ఎమోషన్స్ తో ఈ ఎపిసోడ్ ని చాలా ఆహ్లాదకరంగా మార్చారు. ఇలానే రేపు కూడా సరదాగానే ఉంటుందని అర్ధమవుతుంది. కానీ బిగ్ బాస్ ఎప్పుడు ఎలా అయినా షోని మార్చేస్తాడు కాబట్టి ఏమవుతుందో ఏమో చూద్దాం.

- Advertisement -

Related Posts

బాలీవుడ్ అయితే ఏంటి.. మహానటి తగ్గట్లేదుగా!

మహానటి సినిమాతో తన హావభావాలతో ఎంతగానో ఎట్రాక్ట్ చేసిన క్యూట్ గర్ల్ కీర్తి సురేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం ఆడియెన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం మహేష్ బాబు...

అక్కడ.. మరో మాస్టర్ కావాలట

కరోనా లాక్ డౌన్ తరువాత భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న చిత్రం మాస్టర్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో పాజిటివ్ టాక్ ను అందుకోకపోయినా...

వరుణ్ తేజ్ బాక్సింగ్.. స్పెషల్ అప్డేట్ రెడీ!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా రోజులయ్యింది. చివరగా 2019లో గద్దల కొండ గణేష్, F2 సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న వరుణ్ ఆ తరువాత...

ప్రభాస్, యష్ కాంబో.. కొంచెం చూడండి బయ్యా

బాహుబలితో సెట్ చేసిన ఒక బిగ్గెస్ట్ రికార్డుతో ప్రభాస్ పాన్ ఇండియా అనే దారిని మరింత పెద్దది చేయగా KGF చాప్టర్ 1తో యష్ కూడా మరో దారిని సెట్ చేశాడు. ఇటీవల...

Latest News