బిగ్ బాస్4: చటుక్కున ముద్దు పెట్టేశాడు.. సోహెల్ పనికి హారిక షాక్

Bigg Boss 4 Telugu week 14 Sohel kisses Harika

బిగ్ బాస్ షో ముగిసేందుకు వచ్చింది. పద్నాలుగో వారంలోకి వచ్చేసింది. మిగిలింది ఆరుగురు కంటెస్టెంట్లే. సమీకరణాలు చాలా మారుతున్నాయి. ఇంత వరకు దూరంగా ఉన్న వాళ్లు దగ్గరవుతున్నారు. దగ్గరున్న వాళ్లు దూరమవుతున్నారు. మరీ ముఖ్యంగా అభిజిత్ హారిక ఇంతకు ముందులా ఉన్నట్టు కనిపించడం లేదు. నాగార్జున హారికను హెచ్చరించిన క్షణం నుంచి, కన్ఫెషన్ రూంలో హారిక వీడియోల చూపించిన దగ్గరి నుంచి అభిజిత్‌తో కాస్త దూరంగానే ఉంటుంది.

Bigg Boss 4 Telugu week 14 Sohel kisses Harika
Bigg Boss 4 Telugu week 14 Sohel kisses Harika

అలా అభిజిత్‌కు దూరంగా ఉన్న హారిక.. సోహెల్ అఖిల్ మోనాల్‌కు దగ్గరైంది. మోనాల్‌కు మరీ సన్నిహితురాలిగా మారింది. అక్కాచెల్లెల్లుగా తెగ బిల్డప్ఇస్తున్నారు. హారిక సోహెల్ అఖిల్‌తో ఆడే సరసాలు మాత్రం మరీ దారుణంగా ఉన్నాయి. ఇన్నాళ్లూ లేని ఫ్రెండ్ షిప్, సరసాలు అభిజిత్‌కు దూరంగా ఉండేసరికి చేయడంతో హారిక మీద నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక నిన్న కింగ్ క్వీన్ టాస్క్‌లో హారిక చేసిన ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు.

కింగ్ క్వీన్‌గా మారి ఇంట్లోని నియమాలను ఇష్టమొచ్చినట్టుగా మార్చుకోవచ్చని బిగ్ బాస్ తెలిపాడు. ఈ క్రమంలో మొదటగా సోహెల్ కింగ్ అయ్యాడు. ఆ తరువాత అభిజిత్ అయ్యాడు. అ తరువాత హారిక వంతు వచ్చింది. అయితే రాణిగా ఉన్న హారికను మాటల్లో మాటలు చెబుతూ సోహెల్ ముద్దు పెట్టేశాడు. అలా ఎలా రాణికి ముద్దుపెడతావ్ అంటూ హారిక సోహెల్ మీద ఫైర్అయింది. రాణి అందంగా ఉందని ముద్దు పెట్టానని చెప్పడంతో షాక్ అయింది.