బిగ్ బాస్4: నేను హౌలేగాడినా.. సోహెల్‌పై అఖిల్ ఫైర్

Bigg boss 4 Telugu week 13 Sohel Monal and Akhil issue

బిగ్ బాస్ ఇంట్లో పదమూడో వారం నామినేషన్స్ ప్రక్రియ పెద్ద చిచ్చు పెట్టింది. అఖిల్ మోనాల్ మధ్య మళ్లీ పెద్ద యుద్దమే జరిగింది. అఖిల్ మోనాల్‌ను నామినేట్ చేసినప్పుడు ఆమె ఆ విషయాన్ని స్పోర్టీవ్‌గానే తీసుకుంది. కానీ మోనాల్ అఖిల్‌ను నామినేట్ చేయడాన్ని అతను తీసుకోలేకపోయాడు. ఆ విషయంలో ఇద్దరూ ఒకరినొకరు మాటలు అనుకున్నారు. మళ్లీ మాట తప్పావని, నన్ను ఎప్పుడూ నామినేట్ చేయవని మాటిచ్చావ్.. ఇప్పుడు చేశావ్ అని మోనాల్‌తో అఖిల్ చెప్పుకొచ్చాడు.

Bigg boss 4 Telugu week 13 Sohel Monal and Akhil issue
Bigg boss 4 Telugu week 13 Sohel Monal and Akhil issue

ఎవరి ఆట వాళ్లు ఆడుకుందామని నువ్వే చెప్పావ్ కదా అందుకే నామినేట్ చేశాను అని అఖిల్‌తో మోనాల్ వాదించింది. అయితే టాస్కులు సరిగ్గా ఆడటం లేదు.. దిమ్మాఖ్ పెట్టి ఆడటం లేదని నెపంతో అఖిల్ మోనాల్‌ను నామినేట్ చేశాడు. యాపిల్ కోసే టాస్కులో దిమ్మాఖ్ పెట్టి ఆడలేదంటూ మోనాల్‌ను అఖిల్ నిందించాడు. నువ్ దిమ్మాఖ్‌తో ఆడుతావ్.. నేను దిల్‌తో ఆడుతాను అంటూ మోనాల్ కౌంటర్ వేయడంతో అఖిల్ హర్ట్ అయ్యాడు.

అలా ఈ ఇద్దరి మధ్య దూరం మళ్లీ పెరిగింది. ఈ దూరాన్ని తగ్గించాలని సోహెల్ బాగా కష్టపడ్డాడు. అయితే మోనాల్ మీద ఉన్న కోపాన్ని సోహెల్ మీద చూపించాడు అఖిల్. నేను దిల్‌తో ఆడనంటా అని అంది… నేను హౌలే గాడినా ఆమెతో మాట్లాడటానికి అంటూ సోహెల్ మీద అఖిల్ విరుచుకుపడ్డాడు. కలిసి మాట్లాడుకుందాం.. కూర్చుని సమస్యను పరష్కరించుకుందామని సోహెల్ అఖిల్‌ను బుజ్జగించాడు. మళ్లీ చివరకు ముగ్గురు ఒక్కటయ్యారు.