బిగ్ బాస్4: ఆ ఒక్క మాట చాలు.. కన్నీరు పెట్టుకున్న సోహెల్

Bigg Boss 4 Telugu week 13 Sohel become Emotional For Akhil

బిగ్ బాస్ షోలో ఎట్టకేలకు పదమూడో వారం గడిచేందుకు వచ్చేసింది. ఇక నేటి ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి మళ్లీ యథాతథంగా క్లాసులు పీకుతాడు. తనకు ఇష్టమైన కంటెస్టెంట్లకు ఫేవర్‌గా ఉంటూ మిగతావాళ్లను టార్గెట్ చేస్తుంటాడు. అది అందరికీ తెలిసిందే. ఆ విషయం కాసేపు పక్కన పెడదాం. నిన్నటి ఎపిసోడ్‌లో సోహెల్ అఖిల్ ఎంతగా ఎమోషనల్ అయ్యారో అందరికీ తెలిసిందే. రేస్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా చివరి లెవెల్‌లో అఖిల్ సోహెల్ మిగిలారు.

Bigg Boss 4 Telugu week 13 Sohel become Emotional For Akhil
Bigg Boss 4 Telugu week 13 Sohel become Emotional For Akhil

ఇక ఆ ఇద్దరికి బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఉయ్యాలలో కూర్చోవాలని ఎవరు చివరి వరకు కాలు కింద పెట్టకుండా ఉయ్యాలలోనే కూర్చుంటారో వారికే ఫినాలే టికెట్ లభిస్తుందని తెలిపాడు. అయితే ఆ ఉయ్యాల మీద కూర్చున్న సోహెల్ అఖిల్ దాదాపు ఒక రోజంతా అలాగే కూర్చున్నారు. సమయానుగుణంగా బిగ్ బాస్ పంపించే పదార్థాలను తాగుతూ ఉన్నారు. అలా రాత్రంతా కూడా నిద్రపోకుండానే ఉన్నారు.

ఇక ఓపిక నశించిన సోహెల్ అఖిల్.. ఏదో ఒక నిర్ణయానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరం ఇలా చివరి వరకు ఉంటే.. ఒక వేళ టాస్క్ క్యాన్సిల్ చేస్తే ఎలా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. తాను టాప్ 5లో ఉంటానని, కెప్టెన్ అవ్వాలని అమ్మ కోరుకున్నట్టు అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. తనను తోసేయ్ అని సోహెల్‌కు అఖిల్ చెప్పాడు. ఈ ఒక్క మాటతో ఎమోషనల్ అయిన సోహెల్ ఉయ్యాల నుంచి దిగి పోయాడు. ఆ ఒక్క మాట చాలు.. నేను గెలిచినట్టే అని కన్నీరు పెట్టేసుకున్నాడు. ఇక మొత్తానికి ఈ నాల్గో సీజన్‌లో టాప్ 5లోకి వెళ్లిన మొదటి కంటెస్టెంట్‌గా అఖిల్ రికార్డులకెక్కాడు.