బిగ్ బాస్4: బిగ్ బాస్‌కు వార్నింగ్ ఇచ్చేసింది.. గుండెలు బాదుకున్న అరియానా

Bigg Boss 4 Telugu week 13 Ariyana Fires On Bigg Boss

బిగ్ బాస్ షోలో ఇప్పుడు రేస్ టు ఫినాలె టాస్క్ జరుగుతోందన్న సంగతి తెలిసిందే. ఇందులో రకరకాలుగా ఆట మలుపుతిరుగుతోంది. కలిసికట్టుగా ఆడి సోహెల్ అఖిల్ చివరి స్టేజ్ వరకు వచ్చారు. ఎవరి ఆట వారే ఆడాలని బిగ్ బాస్ చెప్పినా కూడా కలిసి కట్టుగానే ఆడారు. అయితే ఇదే విషయంపై బిగ్ బాస్ హెచ్చరించాడు. రెండో లెవెల్‌లోకి వచ్చిన అఖిల్ సోహెల్ హారిక అభిజిత్‌లకు ఓ టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న మడ్ పిట్‌లో పూలను నాటాలి. ఎవరు తక్కువ పూలను నాటితే వారు ఆట నుంచి తప్పుకున్నట్టేనని తెలిపాడు.

Bigg Boss 4 Telugu week 13 Ariyana Fires On Bigg Boss

అయితే ఈ ఆటలోనూ అఖిల్ సోహెల్ కలిసి పథకం ప్రకారం ఆడారు. గెలిచారు. రెండో లెవెల్‌ మొదటి బజర్‌కు హారిక ఆట నుంచి తప్పుకుంది. తక్కువ పూలు సేకరించడంతో హారిక ఓడిపోయింది. అయితే దీని కంటే ముందు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. పై నుంచి వచ్చే పూలు హారికకు దొరకనివ్వ లేదు సోహెల్. చేతుల్లోంచి లాక్కొవడానికి వీల్లేదన్నారు. మడ్ పిట్‌లోంచి దొంగతనం చేయొద్దన్నారు. ఇక తాను ఎలా ఆట ఆడాలనివాపోయింది.

హారిక సోహెల్ వద్ద ఉన్న రెండు పూలను లాక్కుంది.. దీంతో సోహెల్ హారిక వద్దున్న మొత్తం పూలను లాక్కున్నాడు. అయితే ఆట మధ్యలో బిగ్ బాస్ ఓ ప్రకటన చేశాడు. ఎవరి ఆట వారే ఆడాలి అని అనౌన్స్ చేశాడు. దీంతో అరియానా బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేసింది. ఒక్క అమ్మాయి ముగ్గురితో పోటీ పడుతోంది అయినా వారిద్దరూ కలిసి ఆడుతున్నారని అరియానా వాపోయింది. గుండెల్లో బాధగా ఉంది..నొప్పిగా ఉందని అరియానా అరిచేసింది. నిన్న కూడా అలాగే ఆడారు.. ఎందుకు అనౌన్స్ చేయలేదని బిగ్ బాస్‌ను అరియానా ప్రశ్నించింది.