బిగ్ బాస్4 : ఈ వారం అవినాష్ అవుట్.. సోహెల్ మాట ఏనాడూ తప్పలేదు!

Bigg Boss 4 Telugu week 12 Sohel about Avinash Elimination

బిగ్ బాస్ షోలో సోహెల్ మాట్లాడే మాటలు కొన్ని నిజమవుతూనే వచ్చాయి. మెహబూబ్, అమ్మ రాజశేఖర్‌ల నామినేషన్ విషయంలో ఓ మాట అన్నాడు. మీ ఇద్దరే నామినేషన్‌లో ఉంటే ఎలా అని ఓ సారి మెహబూబ్‌ను సోహెల్ అన్నాడు. చివరకు అదే జరిగింది. మెహబూబ్ అమ్మ రాజశేఖర్‌ల మధ్యనే ఎలిమినేషన్ వచ్చింది. అయితే ఆ రోజు నోయల్ బయటకు వెళ్లాడన్న కారణంతో నామినేషన్స్ క్యాన్సిల్ చేశారు. అలా సోహెల్ మాట నిజమైంది.

Bigg Boss 4 Telugu week 12 Sohel about Avinash Elimination
Bigg Boss 4 Telugu week 12 Sohel about Avinash Elimination

మళ్లీ ఓసారి అరియానా టాప్ 5లో ఉంటుందని మెహబూబ్‌తో అన్నాడు. నీ దరిద్రమైన నోరుతో అనకు అంతా రివర్స్ అవుతుందని మెహబూబ్‌ సోహెల్‌తో అన్నాడు. అయితే మనిద్దరం నామినేషన్స్‌లో ఉంటామని ఆ నాడు సోహెల్ అన్నాడు. చివరకు అదే జరిగింది. మెహబూబ్ సోహెల్‌లో ఎవరో ఒకరు ఉంటారు.. మరొకరు ఎలిమినేట్ అయిపోతారు అనే పరిస్థితి వచ్చింది. ఆ వారంలో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. సోహెల్ బతికిపోయాడు.

అలా సోహెల్ అన్న మాటలు నిజమవుతూనే వచ్చాయి. నిన్నటి ఎపిసోడ్‌లోనూ సోహల్ ఓ మాట అన్నాడు. అవినాష్ సోహెల్ గార్డెన్ ఏరియాలో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ వారం నేను ఎలిమినేట్ అవుతానా? అని అవినాష్ సోహెల్‌ను అడిగాడు. ఈ వీకెండ్‌కు ఏ డ్రెస్ వేసుకుంటావ్ అని సోహెల్ అడిగాడు. మనకేం తెలుసు మా వాళ్లు ఏది పంపిస్తే అదే అని అవినాష్ అన్నాడు. కాస్త మంచిది పంపించు స్టేజ్ మీద బాగా కనపడాలి కదా అని పరోక్షంగా కౌంటర్ వేశాడు. మొదటి సారి ఆ మాటకు అర్థం కాక అవినాష్ లైట్ తీసుకున్నాడు. రెండో సారి కూడా అనడంతో అసలు విషయం అర్థమైంది. అంటే నేను ఎలిమినేట్ అవుతానని అంటున్నావా? అని సోహెల్‌పై అవినాష్ ఫైర్ అయ్యాడు. అయితే బయట ట్రెండ్ కూడా అలానే ఉంది. అవినాష్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే చాన్సులు ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఉండటంతో ఈజీగానే సేవ్ అవుతాడు.