Home Entertainment బిగ్ బాస్4: చీకటి గదిలో అరియానా అరుపులు.. రచ్చ రచ్చ చేసిన సోహెల్

బిగ్ బాస్4: చీకటి గదిలో అరియానా అరుపులు.. రచ్చ రచ్చ చేసిన సోహెల్

బిగ్ బాస్ షోలో పన్నెండో వారం జలజ అనే దెయ్యం ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెట్టింది. ఇంకా పెడుతూనే ఉండేలా కనిపిస్తోంది. మొన్నటి నుంచి ఇంట్లో కంటెస్టెంట్లను ఆడుకుంటూ ఉన్న జలజ.. నిన్నటి ఎపిసోడ్‌లో ఒక్కొక్కరికి చుక్కలు చూపించింది. ఇక అసలే దెయ్యమంటే భయపడే అరియానాను ఓ ఆటాడుకుంది. ఇంటి సభ్యులందరినీ లివింగ్ ఏరియాలోని సోఫాలో కూర్చోబెట్టి రామ్ గోపాల్ వర్మ సినిమాను చూపెట్టాడు. దీంతో అందరూ తీక్షణంగా చూస్తుంటే అరియానా మాత్రం ఉలిక్కిపడుతూ భయపడుతూ చూస్తుంది.

Bigg Boss 4 Telugu Week 12 Ariyana Afraid In Confession Room
Bigg Boss 4 Telugu week 12 Ariyana Afraid In Confession Room

ఆ సినిమా మధ్య మధ్యలో ఆపి కన్ఫెషన్ రూంలోకి పంపించి.. అక్కడ పెట్టిన చెంచాలను (స్పూన్స్) వెతికి తీసుకురావాలని తెలిపాడు. అయితే అది మొత్తం చీకటి గదిలా ఉండగా.. దాన్ని దెయ్యాల కొంపలా సెట్ చేశారు. అందులో జలజ తన గొంతుతో భయపెడుతూ ఉంటుంది.. లైట్లు వేస్తూ ఆర్పేస్తూ భయపెట్టింది. అలా మొదట సారి సినిమా ఆపిన తరువాత అరియానాను లోపలికి పిలిచింది. అయితే తాను మాత్రం ఒంటరిగా వెళ్లనని మొండికేసి కూర్చుంది. అవినాష్ కూడా అరియానాతో వెళ్లాడు.

లోపలకి వెళ్లేందుకు నానా తంటాలు పడింది అరియానా. అరియానా లోపలికి వెళ్లేందుకు మారాం చేస్తుంటే అఖిల్ సోహెల్ ధైర్యం నింపి పంపేందుకు ట్రైచేశారు. లోపలికి వెళ్లిన అరియానా అరుపులతో రచ్చ రచ్చ చేసింది. అరియానా అరుపులకు బయట సోహెల్ ఎంజాయ్ చేశాడు. అలా అరియానా భయపడుతూ ఉంటే ఫుల్ మజాగా ఉందంటూ..డ్యాన్సులు వేస్తూ రచ్చ చేశాడు. ఇక లోపల అరియానా భయానికి అవినాష్ కూడా బెదిరిపోయాడు. 

- Advertisement -

Related Posts

Gouri G Kishan Latest Photos

Gouri G Kishan Popular actress in tamil, Gouri G Kishan latest photos in shooting spot, Gouri G Kishan beautiful images, Gouri G Kishan, Gouri...

ప్ర‌భాస్ ఖాతాలో ఫాస్టెస్ట్ రికార్డ్‌.. అతి త‌క్కువ టైంలో ఆరు మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సొంతం

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ ఛ‌త్ర‌ప‌తి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో ప్ర‌భాస్ న‌ట‌న‌, ఆయ‌న నోటి నుండి వెలువ‌డిన డైలాగులు ప్రేక్ష‌కుల‌ని...

జాతీయ జెండాను ఆవిష్క‌రించిన చిరంజీవి.. జెండా పండుగ వేడుక‌లో పాల్గొన్న‌ మెగా ఫ్యామిలీ

72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు దేశవ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు సంప్ర‌దాయ దుస్తులు ధరించి ఉద‌యాన్నే జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌ను స్థాపించిన చిరంజీవి బ్ల‌డ్...

‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ .. సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ !

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్...

Latest News