బిగ్ బాస్ షోలో అఖిల్ మోనాల్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతీసారి ఈ ఇద్దరి మధ్య ఏదో ఒక చర్చ వస్తూనే ఉంటుంది. ఏదో విషయంపై మాట్లాడుకుంటూనే ఉంటారు. అసలే ఇద్దరూ ఈ వారంలో నామినేషన్స్‌లో ఉన్నారు. అందుకే చాలా సేపు మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలీదు కాబట్టి వీలైనంతగా మాట్లాడుకుంటూ ఉండేందుకు ట్రై చేస్తున్నారు. ఎంత వరకు ఉంటామో తెలీదు ఈ వారమే టైం… మంచిగా ఉందామని మోనాల్ అఖిల్‌తో చెప్పుకొచ్చింది.
ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్‌తో మోనాల్ బాగానే ముచ్చట్లు పెట్టింది. ఇక్కడ ఎవరి గేమ్ వారు ఆడుతున్నారు. పైకి మంచిగా మాట్లాడే వారే ఉన్నారు..పైకి మాటలు ఎన్నో మాట్లాడతారు.. కానీ చేసే వారు ఒక్కరూ కూడా లేరంటూ మోనాల్ చెప్పుకొచ్చింది. నేను మొదటి నుంచి అందర్నీ గమనించాను కాబట్టే ఈ మాటలు చెబుతున్నాను అంటూ అఖిల్‌తో మోనాల్ చెప్పుకొచ్చింది. ఇక సోహెల్ గురించి మాట్లాడుతూ అఖిల్ దగ్గర ప్రామీస్ తీసుకుంది. ఈ మాటలు మళ్లీ సోహెల్‌తో అనకూడదని చెప్పింది.
సోహెల్‌తో మళ్ళీ చర్చించను అని అఖిల్ మోనాల్‌కు మాటిచ్చాడు. సోహెల్ ఈ ఇంట్లో అందరితో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు.. ఎవరితో ఎలా ఉండాలో పక్కా ప్లాన్‌తో వెళ్తున్నాడని అఖిల్ బ్రెయిన్ వాష్ చేసేందుకు ట్రై చేసింది. అయితే అది అతని స్ట్రాటజీ కావొచ్చు.. లేదా అలానే ఉంటాడేమో.. తనతో మాత్రం బాగానే ఉంటాడు.. ఇక వేరే వాళ్లతో ఎలా ఉన్నాడన్నది తనకు అనవసరం అని అఖిల్ చెప్పుకొచ్చాడు. తామిద్దరం బ్రదర్స్‌లా ఉంటామని మోనాల్‌కు అఖిల్ క్లారిటీ ఇచ్చాడు.