Home Entertainment Bigg Boss 4 Telugu: మటన్ కోసం మరీ అంతనా.. అవినాష్‌ను కుమ్మేసిన ఆ ముగ్గురు!!

Bigg Boss 4 Telugu: మటన్ కోసం మరీ అంతనా.. అవినాష్‌ను కుమ్మేసిన ఆ ముగ్గురు!!

బిగ్ బాస్ షోలో మటన్, చికెన్, కూల్ డ్రింక్స్ ఇలా ఏది స్పెషల్‌గా వచ్చినా సరే ఇంటి సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి. మరీ ముఖ్యంగా నాన్ వెజ్ అంటే అందరూ ఎగిరి గంతేస్తారు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులందరూ నిరుత్సాహపడ్డారు. మటన్ చేస్తారని అందరూ ఆశపడ్డారు. మెహబూబ్ మటన్ కోసం మరింత ఎక్కువగా వ్యాయామం చేశాడు., సోహెల్ కూడా ఎక్సర్‌సైజ్ చేశాడట.

Bigg Boss 4 Telugu Week 10 Mutton Become Waste By Avinash Mistake
Bigg Boss 4 Telugu week 10 Mutton become waste By Avinash Mistake

కానీ రేషన్ మేనేజర్ అయిన అవినాష్ తప్పిదం వల్ల మటన్ పాడైపోయింది. దాన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఉండటంతో మటన్ మొత్తం పాడైపోయింది. ఉదయాన్నే లేచాక ఈ రోజు మటన్ వండుతామని, తింటామని ఎంతో ఆశపడ్డాము ఇలా అయిపోయిందంటూ అందరూ కలిసి రేషన్ మేనేజర్‌ మీద విరుచుకుపడ్డారు. రేషన్ మేనేజర్‌గా విఫలమైనందుకు తదుపరి వారం నామినేట్ చేస్తామని చెప్పడంతో అవినాష్ బెదిరిపోయాడు.

బిగ్ బాస్‌ను అడిగి మాకు వెంటనే కేజీ మటన్ తెప్పించు లేదంటే వచ్చే వారం నామినేట్ చేస్తామని ఇంటి సభ్యులు హెచ్చరించారు. ఇది సరిపోదన్నట్టుగా అరియానా మరింత ఎక్కించిచెప్పింది. అది సీక్రెట్ టాస్క్ అని అందుకే అలా చేశాడని సోహెల్‌తో చెప్పింది. అది నిజమని నమ్మి మిగతా వారికి కూడా చెప్పాడు. మెహబూబ్, అరియానా, సోహెల్ కలిసి అవినాష్‌ను కుమ్మి అవతల పారేశారు. మొత్తానికి మటన్ అంటూ అందరూ ఆశపడ్డారు. అంతలోనే నిరుత్సాహపడ్డారు.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News