అతి చేశాడు.. ఎలిమినేట్ చేశారు.. సూర్య కిరణ్‌ అవుట్!

బిగ్‌బాస్ హౌస్‌లో సూర్య కిరణ్‌ది విచిత్రమైన క్యారెక్టర్. పని చేయకుండా పెత్తనాలు జరపడం, అన్ని విషయాల్లో దూరడం, అందరిపై చిరాకు పడటం, ప్రతీ ఒక్కరిపై ఫైర్ అవడం వంటివి చూసి తెలుగు ప్రేక్షకులు విసిగిపోయారు. ఇక ప్రేక్షకుల తిరస్కరానికి గురైన వారు ఇంటి నుంచి వెనక్కి తిరిగి రావాల్సిందే. సూర్య కిరణ్ ఇంత వరకు హౌస్‌లో చేసిన పని ఒక్కటి కూడా కనిపించదు, వారిపై వీరిపై సెటైర్లు వేసుకుంటూ సమయాన్ని గడుపుతాడు. అందుకే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో ఇంటికి పంపించేశారు తెలుగు ప్రేక్షకులు.

Bigg Boss 4 Telugu Surya Kiran Eliminated In First Week
Bigg Boss 4 Telugu Surya Kiran Eliminated In First Week

మొదటి వారంలో గంగవ్వ, అభిజీత్, సుజాత, మెహబూబ్, దివి, సూర్య కిరణ్, అఖిల్ నామినేట్ అయ్యారు. అయితే ఎపిసోడ్స్ ముందుకు సాగుతున్న కొద్దీ సమీకరణాలు మారుతూ వచ్చాయి. మొదటి నుంచి అభిజీత్, గంగవ్వలకు సేఫ్ జోన్‌లోనే ఉన్నారని అర్థమైంది. అయితే మిగిలిన ఐదు గురి డేంజర్ జోన్‌లో ఉంటూ వచ్చారు. కానీ రోజురోజుకూ కొందరి పర్ఫామెన్స్ బెటర్ అవుతూ ఉండటం, ఇంకొందరి ఓవర్ యాక్షన్ పెరుగుతూ వచ్చింది.


ఇప్పటికే గంగవ్వ, అభిజీత్, సుజాత సేవ్ అయినట్టు నాగార్జున ప్రకటించింది. ఇక మామూలుగా అయితే దివి మెడకు ఎలిమినేషన్ ఉచ్చు బిగియాల్సింది. కానీ రెండు రోజుల్లోనే దివి ఫాలోయింగ్, క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో సేవ్ అయిపోయినట్టు తెలుస్తోంది. అఖిల్‌కు ఓ మోస్తరుగా గుర్తింపు వచ్చింది. గంగవ్వ, మోనాల్, ఆరియానా పుణ్యమా అని కాస్తో కూస్తో ఫేమస్ అయ్యాడు. ఇక మెహబూబ్, సూర్య కిరణ్‌ల మధ్యే ఎలిమినేషన్ అని అంతా భావించారు.

మీరు కొంచెం తగ్గించుకుంటే మంచిది.. సూర్యకిరణ్‌కు దివి చురకలు!! |

ఇక సూర్య కిరణ్ చేసిన అతి వల్లే అతను ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల తిరస్కరణకు గురై సూర్య కిరణ్ ఇంటి బాట పట్టాడని లీకులు వస్తున్నాయి. ఇప్పటికే సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యాడని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇలా ముందే లీకవ్వడం ఇదేమీ కొత్త కాదు. అయితే ప్రేక్షకులను సస్పెన్స్‌లో ఉంచుతున్నామని భ్రమపడటం బిగ్‌బాస్ టీం వంతు అవుతోంది. కానీ ప్రేక్షకులకు మాత్రం ఎవరు ఎలిమినేట్ కాబోతోన్నారో ముందే తెలిసిపోతోంది. ఇది ముందు నుంచీ వస్తోన్న సంప్రదాయమే. ఇక నాగార్జున అధికారికంగా ప్రకటించడం, సూర్య కిరణ్ స్టేజ్ మీద ఏం మాట్లాడతాడు? బిగ్ బాంబ్ ఉంటుందా? ఉంటే అది ఏంటి? ఎవరిపై వేస్తాడన్న విషయాలు నేటి ఎపిసోడ్‌లో చూడాలి.