బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌గా సూర్య కిరణ్ రికార్డుకెక్కాడు. అయితే వెళ్తూ వెళ్తూ తన టాలెంట్ ఏంటో అందరికీ చూపించాడు. మామూలుగా మనసుషులను కుక్క, గాడిద, బర్రె వంటివాటితో పోలీస్తే బాధపడుతాం. కానీ సూర్య కిరణ్ మాత్రం వాటితో పోల్చుతూ వాటిలోని పాజిటివిటీలను చెబుతూ హౌస్ మేట్స్ గిచ్చినట్టే గిచ్చి.. ఓదార్చి వెళ్లిపోయాడు. సూర్య కిరణ్ తెలివిని చూసిన అందరూ ముక్కున వేలేసుకున్నారు.
చీమ తనకంటే.. 30 రెట్ల బరువు మోస్తుందని, తన జీవితంలో ఎంతో చూసిందని, మహిళా లోకానికి ఆదర్శంగా నిలవాలని గంగవ్వను చీమతో పోల్చాడు. కెప్టెన్ అయినందున అందరి బాధ్యతలు, ఇంటి బాధ్యత మోయాల్సింది.. గాడిద కంటే బరువులు మోసేది వేరేది లేదు కాబట్టి లాస్యను గాడిద అనేశాడు. మొసలి తన పట్ట వదలది, అది ఎవ్వరి జోలికి వెళ్లదని, తనజోలికి వస్తే మాత్రం ఎవ్వరినీ వదిలిపెట్టదని అందుకే దేవీ నాగవల్లి మొసలితో పోల్చుతున్నానని తెలిపాడు.
అభిజీత్ పిల్లిలాంటివాడని, అయితే గదిలో వేసి కొడితే పులిలా మారుతుందని, పులిలా మారుతాడని తెలిపాడు. హారిక నాగుపాటు వంటిదని, ఆ విషాన్ని మంచి కోసం వాడితే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. సోహెల్.. ఎలుకలాంటి వాడని, దివి.. తాబేలు లాంటిదని, కళ్యాణి.. కోతి, మెహబూబ్.. గ్రద్ద.., సుజాత.. కుక్క, నోయల్ నక్క, అరియానా గుడ్లగూడ, అఖిల్.. దున్నబోతు, అమ్మ రాజశేఖర్ సింహం అంటూ ఇలా అందరినీ నొప్పించకుండానే చెప్పాల్సింది ఎంతో బాగా పాజిటివ్‌గా చెప్పి అందరి చేత వారెవ్వా అనిపించుకున్నాడు.