సుజాత ముద్దు.. ఏంటి అంటూ అవినాష్ షాక్!!

బిగ్‌బాస్ షో మూడో వారం పదహారో రోజు దుమ్ములేచిపోయింది. అవినాష్ అల్లరి, బిగ్‌బాస్ మొదటి ఫిజికల్ టాస్క్‌లతో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. ఇక అవినాష్ మాత్రం మోనాల్, సుజాతలతో పులిహోర కలిపేస్తున్నాడు. వచ్చిన రోజే మోనాల్‌కు లైనేశాడు. తనది కూడా పెద్ద ఫ్యామిలీ ఐదుగురు అన్నయ్యలు అంటూ తన కుటుంబ నేపథ్యం చెప్పి హింట్ ఇచ్చేశాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఏకంగా పాట పాడి ఇంప్రెస్ చేసేందుకు ట్రై చేశాడు.

Bigg Boss 4 Telugu Sujatha Birth day Wishes To Avinash
Bigg Boss 4 Telugu Sujatha Birth day Wishes To Avinash

మోనాల్‌తో అలా ఉంటే.. సుజాతతో మరో ట్రాక్ నడిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మోనాల్ ఏదో 1970లోని హీరోయిన్‌లా ఉందని అంటే అదే విషయాన్ని సుజాతతో చెబుతూ ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. సూపర్ ఉన్నవ్ అలానే చూస్తూ ఉండాలని అనిపిస్తోంది.. అంటూ తన జుట్టు, సవరంపై సెటైర్ వేశాడు. ఇద్దరూ కలిసి ఆట కూడా ఆడుకున్నారు.ఆపై మోనాల్‌తోనూ చేతులు పట్టుకుని గిరిగిరా తిరుగుతూ ఆటాడుకున్నాడు.

Bigg Boss 4 Telugu to begin in August- Cinema express

ఇక మనుషులు రోబోలో టాస్క్‌లో భాగంగా పెద్ద గొడవలు జరిగాయి. రోబోల టీంలో అవినాస్ ఉండగా.. మనుషుల టీంలో సుజాత, మోనాల్ ఇలా అందరూ ఉన్నారు. అయితే అర్దరాత్రి అయిన తరువాత అవినాష్ బర్త్ డేకు సర్ ప్రైజ్ ఇచ్చారు. అర్దరాత్రి పన్నెండు అయిన తరువాత.. అందరూ అవినాష్‌ను విష్ చేశారు. ఈ క్రమంలో ముందుగా మోనాల్, సుజాతలు హగ్ చేసుకుని హ్యాపీ బర్త్ డే అని చెప్పారు. ఈ క్రమంలో సుజాత హగ్ ఇచ్చి.. ముద్దు పెట్టింది. ఏంటి అప్పుడే 12 అయిపోయిందా అని అవినాష్ షాక్ అయ్యాడు. ఇక ఇప్పటికే కంటెస్టెంట్లందరూ సుజాతను అక్కో చెల్లో అని ఫిక్స్ అయ్యారు. మరి అవినాష్ లేటుగా రావడంతో ఇంకా ఏమీ ఫిక్స్ కానట్టున్నారు. వీరిద్దరి మధ్యలో ఏదైనా పుట్టొచ్చేమో.. మరో కొత్త ట్రాక్ నడవొచ్చేమో చూడాలి.