బిగ్‌బాస్ షో ప్రారంభంలోని మొదటి రెండు వారాలు సుజాత-అభిజిత్ విషయం కాస్త తేడా కొట్టింది. అభిజిత్ వద్దన్నా సరే గోరు ముద్దలు తినిపించడం, సుజాత వెరైటీగా చూస్తుందని అభిజిత్ పలుమార్లు చెప్పడం, సుజాత చేసే చేష్టలు కూడా అలాగే ఉండటంతో అందరికీ అనుమానాలు పుట్టుకొచ్చాడు. చెల్లి అన్నాడని సుజాత గొడవపెట్టుకుందని, ఆమె మనసులో ఏదో ఉంది కానీ బయటకు చెప్పడం లేదని నెటిజన్లు ఆటపట్టించారు.
అయితే ఆ విషయంలోనే అభిజిత్, సుజాత మధ్య కాస్త దూరం పెరిగింది. ఏకంగా ఒకరినొకరు నామినేట్ చేసుకుని చివరకు మాట్లాడుకోనంత దూరమయ్యారు. ఆ ఘటన జరిగిన దగ్గరి నుంచి దాదాపు వీరిద్దరూ మళ్లీ సన్నిహితంగా మాట్లాడుకోనే లేదు. ఎలిమినేట్ అయి వెళ్లేటప్పుడు అభిజిత్ బాధపెట్టాడని చెబుతూనే వెళ్లిపోయింది.
అయితే తాజాగా ఈ విషయంపై ఓ చానెల్‌లో మాట్లాడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. మామూలుగా నేను ఎవ్వరినైనా అన్నా, తమ్ముడు, బ్రో అనే పిలుస్తాను. అభిజిత్‌ను కూడా బ్రో అనే పిలుస్తాను. కానీ అది మాత్రం చూపించకుండా గొడవలు జరిగినవి మాత్రమే చూపించాడు. అతనికి కూడా ఇంట్లో చెల్లితో మాట్లాడినట్టు అనిపిస్తుందని చెప్పేవాడు. ఉదయాన్నే లేవగానే నా దగ్గరికి వచ్చి కాఫీ పెట్టమని అంటాడని చెప్పుకొచ్చింది. బయటకు వచ్చాక ఆయనకు అందరి ముందే రాఖీ కడతాను అని కుండబద్దలు కొట్టేసింది. ఆయన ఫ్యాన్స్ ఏమైనా తప్పుగా అనుకుంటూ క్షమించండని సుజాత కోరింది.