బిగ్ బాస్ 4: హిస్టరీలోనే ఫస్ట టైం.. అభిజిత్‌కు అన్ని కోట్ల ఓట్లా?

Bigg Boss 4 Telugu is ABhijeet Got 40 Crore Votes In Finale

బిగ్ బాస్ నాల్గో సీజన్‌కు ఓ స్పెషాల్టీ ఉంది. ఎప్పుడైనా సరే విన్నర్ ఎవరని అడుగుతుంటారు. కానీ
ఈ సారి రన్నర్ ఎవరని అడుగుతున్నారు. 100 పర్సెంట్ లవ్ సినిమాలో ఫస్ట్ ర్యాంక్ కాకుండా సెకండ్ ఎవరొచ్చారని అడిగే సీన్ ఉంటుంది కదా. అచ్చం అలాగే విన్నర్ కాకుండా రన్నర్ ఎవరని అందురూ అడగుతున్నారు.. అదే విషయం చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది అభిజిత్. ఫినాలే ఎప్పుడైన పెట్టుకోండి.. గెలిచేది మాత్రం అభిజిత్ అని అతని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో బల్లగుద్ది మరి చెబుతున్నారు.

Bigg Boss 4 Telugu is ABhijeet Got 40 Crore Votes In Finale
Bigg Boss 4 Telugu is ABhijeet Got 40 Crore Votes In Finale

మామూలుగా నామినేషన్స్‌లో ఉంటేనే మిగతా అందరి కంటే ఎక్కువగా ఓట్లు వచ్చేవి. పోలైన ఓట్లలో యాభై శాతానికిపైగా ఓట్లను ఒక్క అభిజితే కొల్లగొట్టేసేవాడు. అంటే అతని డామినేషన్, ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోండి. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు అభిజిత్‌కు వచ్చిన ఓట్ల సంఖ్య తెలిసింది. ఆ మార్క్ చెబితే ఎవ్వరైన సరే కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఫస్ట్ టైం అనేలా ఎవరికి అందని మార్జిన్‌ను సెట్ చేశారు అభిజిత్ ఫ్యాన్స్.

దాదాపు నలభై కోట్ల ఓట్ల అభిజిత్ ఒక్కడికే పోలయ్యాయని కొత్త ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు. ఇది గనుక నిజమైతే కౌశల్ రికార్డ్ చెరిగిపోయినట్టే. అభిజిత్ క్రేజ్ కౌశల్‌కు కూడా అందనంత ఎత్తులో ఉన్నట్టే. అయితే అభిజిత్ విన్నర్ అన్నది అందరికీ తెలిసిందే. కానీ బిగ్ బాస్ టీం చివర్లో ఏదైనా ట్విస్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుందా? అన్నది చూడాలి. కానీ ఎలాగూ ఎన్ని ఓట్లు వచ్చాయన్నది మాత్రం బయటకు చెప్పదు. కాబట్టి ఇలా సోషల్ మీడియాలో ఎన్ని ఫిగర్లు, కోట్లైనా చెబుతుంటారని కొందరు కామెంట్లు చేస్తున్నారు.