అయితే ఆమెను ఇలా చూడటం అందరికీ కొత్తే. బయట కూడా ఇలానే ఉంటుందా? లేదా బిగ్‌బాస్‌లోనే ఇలా ఉంటుందా? అర్థం కావడం లేదు. మొత్తానికి బుల్లి నిక్కర్లు, పొట్టి స్కర్ట్లు వేసి దుమ్ములేపుతోంది. ఇక నిన్న వేసుకుని బుల్లి గౌను అందరనీ హడలెత్తించింది.
మార్నింగ్ మస్తీ టాస్క్ కోసం బుల్లి గౌను వేసుకుందో.. లేదా అలాంటి డ్రెస్ వేసుకున్నందుకు ఆమెకు ఆ టాస్క్ ఇచ్చాడో అర్థం కాలేదు. ఇక అందర్నీ ఎంటర్టైన్ చేయాలని తెలపడంతో హారిక కొన్ని క్యాటగిరీలను పేర్కొంది. డ్రెస్సింగ్ సెన్స్, డ్యాన్సు, సింగింగ్ అంటూ ఇలా టాస్క్‌ను కంప్లీట్ చేసింది. ఇలా టాస్కులు చేయడంలో భాగంగా వేసుకున్న ఆ స్కర్ట్‌తో హాట్ హాట్ స్టెప్పులు వేసింది.
అది చాలన్నదన్నట్టు టేబుల్ పైకి ఎక్కి మరీ రెచ్చగొట్టింది. ఇక హారిక చేసిన ఆ పర్ఫామెన్స్ కాస్త బెడిసికొట్టింది. ఆమెకు డ్రెస్సింగ్ సెన్స్ లేదని, పర్ఫామెన్స్ దరిద్రంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వీక్ నామినేషన్‌లో ఉంది కాబట్టే ఇలా చేస్తోందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా నిన్నటి ఎపిసోడ్‌లో హారిక మాత్రం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.