బిగ్ బాస్ 4: దివిని చూసి నోరెళ్లబొట్టేశారు.. ఏకంగా ఆ హీరోయిన్‌తో పోల్చిన అఖిల్

బిగ్ బాస్ నాల్గో సీజన్ మొత్తానికే గ్లామర్ తీసుకొచ్చింది దివి. మొదటి రెండు మూడు రోజులు దివి అంటే ఎవరో తెలియలేకపోయినా.. అసలు కథ తరువాత మొదలైంది. అందాల రాక్షసి అయిన దివి ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. ఇలాంటి వారిని మన దర్శకులు, నిర్మాతలు ఎందుకు ఎంకరేజ్ చేయరు అనేంతగా జనాలు ఆమె అందానికి ముగ్దులయ్యారు. దివి అందాలను చూసి ఆడవాళ్లు సైతం అసూయ పడ్డారు. దివి దెబ్బకు సోషల్ మీడియా మొత్తం ఆగమైంది.

Bigg Boss 4 Telugu Akhil Shocked Seeing Divi
Bigg Boss 4 Telugu Akhil Shocked seeing Divi

ఇక దివి చీర కడితే ఆ రోజు సోషల్ మీడియాలో చిచ్చు రేగాల్సింది. మరీ ముఖ్యంగా దివి, నల్ల చీర, గురి చూసి కొట్టే ఆ టాస్కు, అందులో బయటపడ్డ దివి నాభి అందాలు, నడుమును చూసి అందరూ పడిపోయారు. అందుకే హైపర్ ఆది వచ్చిన తరువాత స్టేజ్ మీద అదే చెప్పాడు. ఖుషీలో భూమిక సీన్‌లా అందరూ నీ నడుమే చూశారని కామెంట్ చేశాడు. అంతలా దివి నడుము ఫేమస్ అయింది. మరీ ముఖ్యంగా నల్ల డ్రెస్స్‌లు దివి అందాలను పదింతలు చేస్తుంది.

అందుకే కాబోలు నిన్నటి ఎపిసోడ్‌లోనూ నల్ల డ్రెస్ ధరించింది. తొడలు కనిపించేలా మోడ్రన్ డ్రెస్సుల్లో దుమ్ములేపింది. మెహబూబ్‌తో కలిసి వేసిన స్టెప్పులు మరో లెవెల్‌లో ఉన్నాయి. ఇక అఖిల్ అయితే ఏకంగా ఫ్లాట్ అయిపోయాడు. దీపికా పదుకొణెలా ఉన్నావంటూ దివిని ఆకాశానికెత్తేశాడు అఖిల్. అందరూ కూడా దివిని చూసి షాక్ అయ్యారు. సూపర్ ఉన్నావంటూ పొగడ్తల వర్షం కురిపించారు. మొత్తానికి దివి మాత్రం అందరిలో చెరగని ముద్ర వేసింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles