Bigg Boss 4 Telugu : అసలు మజా షురూ.. మోనాల్ కోసం మొదలైన అభిజిత్-అఖిల్ వార్

Bigg Boss 4 Telugu ABhijeet Fires On Akhil

బిగ్‌బాస్ నాల్గో సీజన్ చూస్తున్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ తరుణం వచ్చింది. అభిజిల్ మోనాల్ అఖిల్ ట్రయాంగిల్ స్టోరీ అందరికీ తెలిసిందే. ఇద్దరు స్నేహితుల్లా ఉన్న అభిజిత్, అఖిల్‌లు మోనాల్ వల్ల దూరమయ్యారు. ప్రస్తుతం ఒకరినొకరు చూసుకోవడం, మాట్లాడుకోవడం కూడా చేయడం లేదు. మొత్తానికి మోనాల్ వల్ల బద్ద శత్రువుల్లా తయారయ్యారు. తాజాగా వీరిద్దరికి టగ్ ఆఫ్ వార్ మొదలైంది.

Bigg Boss 4 Telugu ABhijeet Fires On Akhil
Bigg Boss 4 Telugu ABhijeet Fires On Akhil

ఐదో వారానికి గానూ ఇచ్చిన నామినేషన్ టాస్క్‌లో అభిజిత్ అఖిల్‌ను ఏకిపారేశాడు. కరెక్ట్ పాయింట్లు మాట్లాడటంతో అఖిల్ నోర్మూసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా అభి అఖిల్ పేరున చెప్పినట్టు తెలుస్తోంది. నువ్ కన్ఫ్యూజ్ అవుతావ్ అని నాకు తెలుసు. కానీ పచ్చి అబద్దాలు మాట్లాడుతావని ఇప్పుడు తెలిసింది.. అలా చూసి ఇలా చూసి మాట్లాడితే భయపడతారని అనుకోకు అని అభిజిత్ అఖిల్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.

వేలు అలా చూపించి మాట్లాడకు డూడ్ అంటూ అఖిల్ అభిజిత్ మీదకు ఫైర్ అయ్యాడు. ప్రతీసారి నువ్ చేసేది అదే అంటూ అభి మరో కౌంటర్ వేశాడు. నువ్ ఆ రోజు మోనాల్‌ మీద కూడా అలాగే వేలు పెట్టి చూపించావ్.. అని అభి రెచ్చిపోయాడు. ఆ వెంటనే.. ఆమె ఇష్యూ నీకెందుకు బ్రదర్ అంటూ అభి రివర్స్ కౌంటర్ వేశాడు. అమ్మాయి గురించి అలా మాట్లాడితే.. ఆమె క్యారెక్టర్ బయటకు ఎలా వెళ్తుందో అని అఖిల్ రెచ్చిపోయాడు. అది తాము ఇద్దరం చూసుకుంటాం నీకెందుకు అంటూ అభిజిత్ రెచ్చిపోయాడు. ఇలా అసలు మజా నేడు మొదలయ్యేట్టు కనిపిస్తోంది.