బిగ్ బాస్4: ఇంటెలిజెంట్ అభిజిత్ అలా తప్పు చేశాడు.. మోనాల్ భలే దొరకపట్టింది!!

Bigg Boss 4 Telugu Abhijeet Did a mistake in dance task

బిగ్ బాస్ షోలో అభిజిత్ గురించి అతను ఆలోచించే విధానం, ఆచరణలోకి తీసుకొచ్చే ఆలోచనల గురించి అందరికీ తెలిసిందే. ప్రతీ చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా గమనించి పరిశీలించి ముందుకు కదులుతుంటాడు. ఇక బిగ్ బాస్ పంపించే టాస్క డీటైల్స్ అయితే ఓ పది సార్లు చదువుతాడు. క్షుణ్నంగా చదివి ఎక్కడా ఎలాంటి లొసుగులున్నాయి.. ఎలా అనుకూలంగా మల్చుకోవచ్చు.. నియయ నిబంధనలేంటి? అన్న విషయాలను బాగా తెలుసుకుంటాడు.

Bigg Boss 4 Telugu Abhijeet Did a mistake in dance task

అలాంటి అభిజిత్ నిన్నటి టాస్క్‌లో తుస్సుమన్నాడు. మొదటిసారిగా టాస్క్‌లో నియమాలను మరిచిపోయాడు. గోల్డెన్ మైక్ సాధించి ఓట్లను అప్పీల్ చేసుకునేందుకు నాల్గో టాస్క్‌ ఇచ్చాడు. స్టేజ్ మీద ఎక్కి మ్యూజిక్స్ ప్లే చేసినంత సేపు ఆడుతూనే ఉండాలని చెప్పాడు. మధ్యలో ఆగడం కానీ, కూర్చోవడం గానీ, స్టేజ్ దిగడం కానీ చేయొద్దని అన్నాడు. పాటలు ఆగిన ప్రతీసారి ఎవరో ఒకరు దిగాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు.

అలా మొదటి సారి మ్యూజిక్ ఆగిన తరువాత పెద్ద చర్చే జరిగింది. అరియానా ఇప్పటికే రెండు సార్లు, సోహెల్ ఒక్కసారి గోల్డెన్ మైక్ సాధించారు. కానీ ఆ ఇద్దరూ ముందు దిగడానికి అంగీకరించలేదు. అరియానాకు ఇంకా డ్యాన్స్ చేయాలనిపిస్తోందంటూ.. తరువాత దిగుతాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ గొడవ ఎంతకీ తేలడం లేదని, నియమాలను మరిచిపోయిన అభిజిత్ స్టేజ్ మీద కూర్చున్నాడు. మోనాల్ అది కనిపెట్టి.. తప్పని చెప్పింది. మళ్లీ టాస్క్ నియమాలను చదివి, తనది తప్పని తెలుసుకున్న అభిజిత్ స్టేజ్ మీద నుంచి దిగిపోయాడు. అలా అభిజిత్ తప్పును మోనాల్ భలే కనిపెట్టేసింది.