అయ్యా బిగ్ బాసు.. నావల్ల కావడం లేదు. నాకు ఏసీ పడుతలేదు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నా. నన్ను పంపించేయండి.. అంటూ గంగవ్వ బిగ్ బాస్ ను కోరిన సంగతి తెలిసిందే. అయితే.. నిజానికి గంగవ్వ హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్. తన వయసు సహకరించకపోయినప్పటికీ.. తను హౌస్ లో అన్ని విషయాల్లో బాగా పార్టిసిపేట్ చేస్తోంది. టాస్కుల్లోనూ బాగానే పర్ ఫార్మ్ చేస్తోంది. అయితే.. గంగవ్వ గురించి మొదటి వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ సంచలన కామెంట్స్ చేశాడు.
గంగవ్వ ఆరోగ్యానికి ఏం కాలేదు. తను స్ట్రాంగ్ కంటెస్టెంట్. కానీ.. గంగవ్వ విషయంలో ఇంటి సభ్యులు ప్రవర్తిస్తున్న తీరే అతిగా ఉంది. తనపై అతి ప్రేమ చూపిస్తున్నారు. నిజానికి అది ప్రేమ కాదు దోమ కాదు. అదంతా నాటకం. గంగవ్వను హౌస్ నుంచి పంపించడం కోసం మిగితా కంటెస్టెంట్లంతా కలిసి ఆడుతున్న నాటకం.. అంటూ ఓ ఇంటర్వ్యూలో సూర్య కిరణ్ బాంబు పేల్చాడు.
గంగవ్వను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మంచిగా చూసుకోవాలి. ఆమెను ఏదైనా అంటే వాళ్ల పరువే పోతుంది. అందులోనూ తన వయసు పెద్ద. కొన్న పనులు చేయలేదు. తన పనులు కూడా తాను కొన్ని చేసుకోలేదు. ఈ నేపథ్యంలో తనపై కపట ప్రేమ చూపిస్తూ… ఎలాగైనా తనను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లగొట్టడానికి ప్లాన్ చేశారు.. అని ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
పడవ టాస్క్ లోనూ గంగవ్వ నువ్వు ఎక్కువ సేపు అక్కడ కూర్చోలేవు.. నువ్వు దిగిపో.. నువ్వు నామినేట్ అయినా మళ్లీ నీకు ఓట్లేసి గెలిపిస్తారు జనాలు.. అంటూ అలా మాట్లాడటం ఎందుకు? తనకు ఓపిక ఉన్నంత సేపు ఉంటుంది. కానీ.. తనను ముందే దిగిపోవాలంటూ అడగడం ఎందుకు? మళ్లీ నీ ఇష్టం ఉంటే ఉండు.. లేకపోతే దిగిపో.. అనడంలో అర్థం అదే కదా. తనను ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి పంపించే కుట్ర జరుగుతోంది. తను చాలా ఆరోగ్యంగా ఉంది, చాలా యాక్టివ్. తను స్ట్రాంగ్ ప్లేయర్. ఖచ్చితంగా ఫైనల్స్ వరకు చేరుకునే సత్తా గంగవ్వకు ఉంది.. అంటూ సూర్య కిరణ్ చెప్పుకొచ్చాడు.