ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు బిగ్ బాస్ ఫీవర్ పట్టుకుంది. రాత్రి 9.30 అయిందంటే చాలు.. అందరూ టీవీల ముందు కూర్చొని బిగ్ బాస్ షోను చూస్తున్నారు. నా ఫేవరేట్ కంటెస్టెంట్ ఈయన. నా ఫేవరేట్ ఆమె.. అంటూ ఎవరికి నచ్చిన కంటెస్టెంట్ ను వాళ్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. రకరకాల రంగాల్లో ఫేమస్ అయిన వాళ్లను ఈ షోకు సెలెక్ట్ చేశారు. అందులో చాలామంది గురించి జనాలకు తెలుసు. తెలియని వాళ్లు ఉంటే.. ఇక వాళ్ల గురించి తెలుసుకోవడం కోసం జల్లెడ పడుతున్నారు జనాలు. గూగుల్ లో ఆ కంటెస్టెంట్ల వివరాలన్నీ రాబడుతున్నారు.
అయితే.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య కిరణ్.. అనే కంటెస్టెంట్ డైరెక్టర్ అని అందరికీ తెలిసిందే. కాకపోతే ఆయన భార్య ఎవరో మాత్రం చాలామందికి తెలియదు. ఆమె ఎవరో కాదు తెలుగు సీనియర్ నటి కళ్యాణి.
చీరకట్టులో ఎంతో సహజంగా కనిపించి.. అందరి మన్ననలు పొందిన కళ్యాణే ఆయన భార్య. ప్రస్తుతం కళ్యాణీ సినిమాల్లో నటించడం లేదు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకే ఇద్దరూ విడిపోయారు.
సూర్య కిరణ్.. తెలుగులో సత్యం, ధన51, రాజు భాయ్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.
తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చూద్దాం.. ఈ ఎంట్రీతోనైనా సూర్య కిరణ్ లైఫ్ టర్న్ అవుతుందో లేదో?