బిగ్ అప్డేట్ : “వకీల్ సాబ్ 2” రాబోతుంది.!

Dil Raju gets 12 crore more profits from Vakeel Saab

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా చేసిన హ్యాట్రిక్ సినిమా “వకీల్ సాబ్” కోసం అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో వచ్చిన ఎన్నో మార్పులు టికెట్ ధరలు నానా రచ్చ కూడా మామూలుది కాదు.

మరి గత రెండేళ్ల కితం కరోనా పీక్ స్టేజి లో ఉన్నపుడు రిలీస్ అయ్యిన ఈ సినిమా జస్ట్ రెండు వారాలు థియేటర్స్ లో రన్ అయ్యి 85 కోట్లకి పైగా షేర్ ని రాబట్టి పవన్ కెరీర్ లో ఊహించని కం బ్యాక్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ ఈ సక్సెస్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ కి సింహ భాగం చెందుతుంది.

పవన్ ని ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేసి వేణు శ్రీరామ్ బాగా హైలైట్ అయ్యాడు. అయితే ఇపుడు ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందా అంటే అవుననే న్యూస్ ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనిని స్వయంగా దర్శకుడే అభిమానులకి కన్ఫర్మ్ చేసాడు. వకీల్ సాబ్ 2 ఖచ్చితంగా ఉంది అని ప్రస్తుతం సినిమా రాస్తున్నానని తాను తెలిపాడు.

దీనితో ఈ బిగ్ అప్డేట్ ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపింది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే స్టార్ట్ అవుతుందని కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా కి సీక్వెల్ ని ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. మరి మొదటి సినిమా కథ రీమేక్ అని అందరికీ తెలుసు. దీనికి ఎలా డిజైన్ చేసారో మరి.