బిగ్ అప్డేట్ : “హరిహర వీరమల్లు” మేకర్స్ సాలీడ్ క్లారిటీ.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది కాగా దీనిని దర్శకుడు క్రిష్ భారీ వ్యయంతో అనేక హంగులతో పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కస్తున్నారు.

ఇక ఈ సాలిడ్ సినిమాలో ఇప్పటికే భారీ యాక్షన్ సీక్వెన్స్ లను కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరో గ్రాండ్ షెడ్యూల్ కి రెడీ చేసింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నట్టుగా ఇది వరకు అందరికీ తెలిసిందే. పలు రూమర్స్ కూడా దీనిపై రాగా ఫైనల్ గా అయితే చిత్రంలో తాను జాయిన్ అయ్యినట్టుగా చిత్ర యూనిట్ ఇప్పుడు అనౌన్స్ చేసేసారు.

ఇక దీనిపై వీడియో కూడా రిలీజ్ చేయగా ఇందులో మరో సాలీడ్ క్లారిటీ కూడా అందించడం విశేషంగా మారింది. మరి ఈ వీడియోలో అయితే చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని ఎలాగైనా వచ్చే ఏడాది వేసవిలోనే రిలీజ్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేశారు.

అలాగే బాబీ డియోల్ తో పవన్ మధ్య కూడా అదిరే సీన్స్ ఉన్నాయని మేకర్స్ ఇప్పుడు అప్డేట్ ఇచ్చారు. వీటితో అయితే సినిమా రిలీజ్ మాత్రం నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందించారు.