బిగ్ అప్డేట్ : పవన్ – సాయి తేజ్ సినిమా మొత్తానికి మొదలు.!

Heres-the-start-date-for-Pawan-Kalyan-Sai-Tej-Vinodaya-Sitam-remake

గత కొంత కాలం నుంచి గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న చేయనున్న చిత్రాల్లో రెండు రీమేక్ సినిమాలు అయితే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి కాగా మరో చిత్రం అయితే కోలీవుడ్ హిట్ సినిమా వినోదయ సీతం రీమేక్ అని చెప్పాలి.

అయితే పవన్ చేతిలో ఉన్న ఈ సినిమాలు పవన్ ఇప్పుడు స్టార్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈరోజు వినోదయ సీతం రీమేక్ విషయంలో మేకర్స్ అయితే బిగ్ అప్డేట్ ని అందించారు. సినిమా మెయిన్ హీరో సాయిధరమ్ తేజ్ తో కలిసి పవన్ ఉన్న ఫొటోస్ లో నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరి వారు అదిరే అప్డేట్ ని ఈరోజు అందించారు.

గత కొన్నాళ్ల కితమే సినిమా ముహూర్తం జరుపుకోగా ఈరోజు నుంచి అధికారికంగా ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లినట్టుగా కన్ఫర్మ్ చేశారు. కాగా ఈ సినిమాకి మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సినిమా అనౌన్సమెంట్ లో పాల్గొనగా ఈ చిత్రానికి దర్శకుడుగా తమిళ్ వెర్షన్ కే వర్క్ చేసిన సముద్రఖని నే పని చేయనున్నారు.

దీనితో ఎట్టకేలకు ఈ సినిమా కూడా స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. అయితే ఈ సినిమాకి పవన్ కేవలం మూడు వారాలు మాత్రమే డేట్స్ ఇచ్చారు. దీనితో తన స్క్రీన్ స్పేస్ సినిమాలో తక్కువే ఉండగా సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటించనుంది. అలాగే మరిన్ని అప్డేట్స్ రానున్న రోజుల్లో ఉంటాయని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.