బిగ్ అప్డేట్ : అప్పుడే “ఏజెంట్” ఓటిటి డేట్ ఫిక్స్..ఎందులో అంటే.!

లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రం “ఏజెంట్”. అక్కినేని వారి యంగ్ హీరో దాదాపు మూడేళ్ళ పాటుగా కష్టపడి చేసిన ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి అయితే తెరకెక్కించారు. ముందు వరకు మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఉండి ఉండి హైప్ తగ్గించుకొని రిలీజ్ అయ్యింది.

పోనీ అయ్యాక అయినా అంచనాలు అందుకుందా అంటే అది కూడా లేకుండా మొదటి రోజుకే డిజాస్టర్ అని తేలిపోయింది. అఖిల్ ఇన్నాళ్ల కష్టం, మేకర్స్ భారీ ఖర్చు అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిపోయింది. ఇక సినిమా థియేటర్స్ లో తేలిపోవడంతో ఊహించని విధంగా అప్పుడే ఏజెంట్ ఓటిటి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయ్యిపోయింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని సంస్థ సోని లివ్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ మే 19 నుంచే చిత్రం రిలీజ్ కి వచ్చేస్తుంది అని తాజాగా వారు కన్ఫర్మ్ చేసేసారు. దీనితో కనీసం నెల కూడా లేకుండా వచ్చేస్తున్నా మరో సినిమాగా అయితే ఏజెంట్ నిలిచింది.

కాగా ఈ ఎర్లీ స్ట్రీమింగ్ కి అయితే కాస్త ఎక్కువ డబ్బు చెల్లించడంతో నష్టాలు కొంతైనా పూడుతాయని మేకర్స్ ఈ డిసిషన్ తీసుకున్నారని తెలుస్తుంది. మొత్తానికి అయితే సరైన ప్లానింగ్ కథ లేకపోవడం మూలాన సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా నిర్మాత అనీల్ సుంకర 80 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మాణం వహించారు. 
https://twitter.com/Muhamme16625789/status/1653597040209809408?s=20