ఒక్క దక్షిణాది సినిమా దగ్గర మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఎంతో పేరు ఉన్న సంగీత దర్శకుల్లో దిగ్గజ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజా కూడా ఒకరు. కాగా ఇన్నేళ్ల తన కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాలు లాంటి పాటలు అందించిన ఇళయరాజా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
అయితే ఇప్పుడు ఇళయరాజా గారి ఇంట తీరని విషాదం చోటుచేసుకుంది అన్న వార్త వారి అభిమానులని కూడా తీవ్రంగా కలచి వేస్తుంది. మరికొన్ని వివరాల్లోకి వెళితే ఇళయరాజా కూతురు నేషనల్ అవార్డ్ విన్నింగ్ గాయని అయినటువంటి భవతరణి నిన్న తన తుదిశ్వాస విడిచారు.
అయితే ఆమె గత కొన్నాళ్ల నుంచి క్యాన్సర్ తో బాధ పడుతుండగా ఆ కారణం చేతనే ఆమె నిన్న చికిత్స పొందుతూనే కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొనగా ఈ విషాద ఘటనతో అయితే తెలుగు మరియు తమిళ సినీ పరిశ్రమకి సంబంధించి అనేకమంది సినీ ప్రముఖులు ఇళయాళరాజకి అలాగే తమ తోటి సంగీత దర్శకుడు అయిన యువన్ శంకర్ రాజాకి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తు ధైర్యం చెప్తున్నారు.
అయితే భవతరణి ఇప్పుడు వరకు 30 సినిమాల్లో పాలు ఆలపించగా కేవలం ఇంత తక్కువ సంఖ్యలో కూడా ఆమె నేషనల్ అవార్డుని కూడా అందుకోవడం విశేషం. కానీ ఆమె చిన్న వయసులో ఇళయరాజా ఇంటి నుంచి దూరం కావడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి.
This is Shocking…..
strength to @ilaiyaraaja sir’s family ..Gone too soon dear #bhavatharini 🥺
Heart is heavy 💔May her soul Rest in Peace pic.twitter.com/r5HdKyWSwP
— thaman S (@MusicThaman) January 25, 2024
The voice that forever lives in the heart of people for its innocence and love! You were a pure soul! Gone too soon! I pray to God to give strength to the family of Illayaraja sir and my brother @thisisysr at this moment! Rest in peace Bhavatharini. 💔#Bhavatharini #RIP pic.twitter.com/PO3ArYGq49
— Silambarasan TR (@SilambarasanTR_) January 25, 2024