ఈ మధ్యకాలంలో బుల్లితెర వెండితెర నటీనటులు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. గత ఏడాది ఎదో మంది సెలబ్రిటీలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టగా మరి కొంతమంది తల్లిదండ్రులుగా మారిపోయారు. ఇలా గత ఏడాది ఎంతోమంది సినీ తారలు సీరియల్ నటిమలు అమ్మలుగా మారిపోయారు. ఈ క్రమంలోనే బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవి గురించి అందరికీ సుపరిచితమే.ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న దేవత సీరియల్ లో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించారు.
ఈ సీరియల్ నుంచి మధ్యలోనే ఈమె తప్పుకొని నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేసారు.ఇలా దేవత సీరియల్ నుంచి తప్పకున్న అనంతరం ఈమె సీరియల్ దర్శకుడు సురేష్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే సీరియల్స్ కు దూరమైనటువంటి వైష్ణవి సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే తన పెళ్లికి సంబంధించిన ఎన్నో వీడియోలను అభిమానులతో షేర్ చేసుకున్న ఈమె తాను అమ్మను కాబోతున్నానంటూ కూడా ఒక వీడియో ద్వారా తాను ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా త్వరలోనే తన సీమంత ఉందంటూ ఈమె గత కొద్దిరోజులుగా తన సీమంతం కోసం షాపింగ్ చేసినటువంటి వీడియోలను కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఇక ఈమె సీమంతపు వేడుకలు చాలా ఘనంగా జరిగాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన సీమంతపు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి అయితే ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.