Hema: సినీ నటి హేమ గత ఏడాది జూలై నెలలో బెంగళూరులో ఓ పార్టీకి హాజరయ్యారు అయితే పుట్టినరోజు వేడుక కోసమే తను హాజరైనట్లు వెల్లడించారు కానీ ఈ పార్టీలో భాగంగా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను వినియోగించారని పోలీసులకు సమాచారం వెళ్లడంతో పోలీసులు ఈమెను అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారు. ఈమె గురించి ఇలాంటి వార్తలు రావడంతో తాను హైదరాబాదులోనే తన ఫామ్ హౌస్ లో ఉన్నానని తన గురించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వీడియోలను విడుదల చేశారు.
ఇకపోతే పోలీసులు మాత్రం ఈమె అరెస్టుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు అంతేకాకుండా ఈమెకు డ్రగ్స్ పరీక్షలు చేయగా పాజిటివ్ అని రావడంతో పోలీసులు తనని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇలా 14 రోజులపాటు జైలులో ఉన్న హేమ అనంతరం బెయిలు మీద బయటకు వచ్చారు. ఇలా బెయిల్ మీద ఉన్నటువంటి ఈమె తరుచూ విచారణకు హాజరవుతున్నారు.
ఇకపోతే తాజాగా ఈ కేసు విషయంలో ఈమెకు కర్ణాటక హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చారని చెప్పాలి. ఆమెపై నమోదైన కేసులపై విచారణ నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా కోర్ట్ నిర్ణయంతో హేమకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే, కేసు పై పూర్తిస్థాయి విచారణ ఇంకా జరుగుతుందని కోర్టు పేర్కొంది. ఇక ఈమె మాత్రం తన పై నమోదు అయిన కేసును పూర్తిస్థాయిలో తప్పు పడుతూ వస్తున్నారు. తాను ఈ రేవ్ పార్టీలో పాల్గొనలేదని ఉద్దేశపూర్వకంగానే నాపై ఇలాంటి కేసులు పెట్టి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ కేసు విషయంలో ఆరోపణలు చేశారు.
ఇక ఈమె ఈ కేసులో చిక్కుకోవడంతో మా అసోసియేషన్ కూడా ఈమెను సస్పెండ్ చేశారు. తన తప్పు ఏమాత్రం లేదని తెలిసి తనకు క్లీన్ చిట్ ఇస్తే తిరిగి తనని మా అసోసియేషన్ లో సభ్యత్వం కల్పిస్తామంటూ విష్ణు కూడా ఈ కేసు విషయంలో స్పందించిన సంగతి తెలిసిందే. మరి చివరి వరకు ఈ కేసులో విచారణలను ఎదుర్కొంటూ హేమ క్లీన్ చీట్ ద్వారా బయటకు వస్తారా లేకపోతే ఆరోపణలను నిజం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.