బిగ్ న్యూస్ : ఆ రాజకీయ పార్టీలోకి ఈ బిగ్ స్టార్ హీరో.?

మన దక్షిణాది సినిమా దగ్గర ఇప్పుడు రాజకీయాలు అలాగే సినిమాలు వేరు వేరు కాదు ఒకటే అన్నట్టుగా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసిందే. మరి అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేయగా తమిళ్ నాడులో అయితే కమల్ హాసన్ మరియు రజినీకాంత్ లు విషయంలో రాజకీయాలు నడుస్తూ ఉంటాయి.

ఇక కన్నడ సినిమా నుంచి అయితే రియల్ స్టార్ ఉపేంద్ర ఇది వరకు ఎప్పటి నుంచో రాజకీయాల విషయంలో మాట్లాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఇదే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఓ స్టార్ హీరో ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం ఇవ్వనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఆ హీరో ఎవరో కూడా కాదు విక్రాంత్ రోనా ఫేమ్ అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ అట. మరి సుదీప్ ఈరోజు రాజకీయాల్లో అధికారిక ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తుంది. సుదీప్ ఈరోజు అక్కడ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ కండువా కప్పుకొని అయితే ఈ పార్టీ లో జాయిన్ కానున్నాడని బిగ్ న్యూస్ ఇప్పుడు బయటకి వచ్చింది.

దీనితో ఈ వార్త ఇప్పుడు కన్నడ సినీ మరియు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతుంది అని చెప్పాలి. మరి సుదీప్ కి కన్నడ లో భారీ ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా తాను భారీ పాన్ ఇండియా సినిమా “కబ్జా” లో కీలక పాత్ర కూడా చేశారు. అంతే కాకుండా తెలుగులో ఈగ, సైరా లాంటి సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే.