ఈ ఏడాది బాలీవుడ్ సినిమా దగ్గర భారీ సక్సెస్ లు ఒకదాని తర్వాత ఒకటి వస్తుండగా అలా వాటితో పాటే ఏదో సెన్సేషన్ రేపేస్తాం అన్నట్టుగా వచ్చి చతికిల పడిన చిత్రమే “వాక్సిన్ వార్”. బాలీవుడ్ లో సంచలన విజయం నమోదు చేసిన చిత్రం ది కాశ్మిర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ఇండియాలో కరోనా సమయంలో వాక్సిన్ కనుక్కొనే ప్రాసెస్ లో జరిగిన అంశాల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే ఇది.
దీనిని కూడా గట్టిగానే ప్రచారం చేసుకున్నారు కానీ ఈ చిత్రం కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తెచ్చుకోలేకపోయింది. దీనితో బాలీవుడ్ లో ఈ ఏడాదికి అయితే భారీ డిజాస్టర్ గా మిగిలిపోయిన ఈ సినిమా యూనిట్ ఇప్పుడు షాకింగ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా కథ అయితే ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు అకాడమీ వారు సెలెక్ట్ చేసి ఇన్వైట్ చేసారని ఆ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ గుడ్ న్యూస్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
దీనితో అకాడమీ నుంచి తమకి వచ్చినా మెయిల్ ని షేర్ చేసి తమ వాక్సిన్ వార్ అందుకున్న గౌరవాన్ని అయితే పంచుకున్నారు. దీనితో కనీశం బాక్సాఫీస్ దగ్గర విజయం అందుకోకపోయినా ఇలాగైనా మంచి గుర్తింపు ఈ చిత్రానికి వచ్చింది అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పాటేకర్ లాంటి దిగ్గజ నటులు నటించారు.
A proud moment for #TheVaccineWar as its script has been invited and accepted in the ‘Academy Collections’ by the library of Oscars.
The story about our true heroes will be available for people to read.#IndiaCanDoIt 🇮🇳@nanagpatekar @AnupamPKher @gowda_sapthami @raimasen… pic.twitter.com/AUfKi4582z
— Abhishek Agarwal 🇮🇳( Modi Ka Parivar) (@AbhishekOfficl) October 12, 2023