గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న చేయనున్న చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో అనౌన్స్ చేసిన మాసివ్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. అయితే నిజానికి ఈ సినిమాని ముందు భవదీయుడు భగత్ సింగ్ అనే స్ట్రైట్ సినిమాగా ప్లాన్ చేయగా కానీ తర్వాత దీనిని కాస్త మార్పులు చేర్పులు చేసి రీమేక్ సినిమాగా మార్చేశారు.
అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా పాన్ ఇండియా హ్యాపెనింగ్ బ్యూటీ పూజా హెగ్డే ని ఫిక్స్ చేయగా ఆమెనే మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా లాక్ చేశారు. అయితే ఇప్పుడు సినీ వర్గాల నుంచి లేటెస్ట్ గా వస్తున్న సమాచారంతో ఐతే ఈ విషయంలో బిగ్ చేంజ్ సినిమాలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
సినిమా నుంచి పూజా హెగ్డే అవుట్ కాగా ఆమె ప్లేస్ ఓ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ ఫిక్స్ అయ్యినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో కూడా కాదట. ధమాకా సెన్సేషన్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీ లీల అట. ఈ యంగ్ హీరోయిన్ నే మేకర్స్ పూజా హెగ్డే ప్లేస్ లో ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇది ప్రస్తుతానికి ఫైనల్ అయ్యే స్టేజి లో ఉండగా పూజా ని అయితే ఈమె రీప్లేస్ చేసేసినట్టే అని కొందరు అంటున్నారు. మొత్తానికి అయితే ఈ భారీ సినిమాలో ఊహించని మార్పే వచ్చింది అని చెప్పాలి. కాగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.