బిగ్ బజ్ : ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ ఖరారయ్యిందా.?

ఇపుడు ఒక్క పాన్ ఇండియా సినిమా దగ్గర మాత్రమే కాకుండా టోటల్ గా పాన్ వరల్డ్ లెవెల్లోనే మంచి క్రేజ్ ని తెచ్చుకున్న ఇండియన్ హీరో అందులోని తెలుగు హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి ఎన్టీఆర్ అయితే తన గ్లోబల్ సక్సెస్ ఆర్ ఆర్ ఆర్ తో ఖండాంతరాల్లో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు.

దీనితో తనకి కూడా హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తాయని చాలా మంది అనుకున్నారు. అయితే ఇది దీనిపై ఇంత త్వరగా ఓ న్యూస్ వింటామని మాత్రం చాలా మందు అనుకోకపోవచ్చు. కాగా లేటెస్ట్ గా అయితే ప్రముఖ వరల్డ్ పాపులర్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థకి చెందిన జేమ్స్ ఫారెల్ ఎన్టీఆర్ ని అలాగే జక్కన్న రాజమౌళి లను కలవడం ఆసక్తిగా మారిపోయింది.

సెన్సేషనల్ వెబ్ షో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ కి ప్రొడ్యూసర్ అయ్యిన తాను ఎన్టీఆర్ ని కలవడంతో అయితే ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో ఖచ్చితంగా ఇప్పుడు హాలీవుడ్ ఎంట్రీ కూడా ఉందని అభిమానులు అయితే ఫిక్స్ అయ్యిపోయారు. కానీ ప్రస్తుతానికి ఇంకా ఈ మీటింగ్ వెనుక ఉన్న మర్మం ఏమిటి అనేది ఇంకా తెలియ రాలేదు.

కానీ ఇలాంటి వారు  అంటే ఖచ్చితంగా అది సినిమానో లేక ఓటిటి షో కోసమో అని ఖచ్చితంగా ఉంటుంది. సో డెఫినెట్ గా అయ్యితే ఎన్టీఆర్ నుంచి అతి త్వరలోనే తన హాలీవుడ్ ఎంట్రీ కోసం న్యూస్ రావచ్చని చెప్పాలి. అలాగే రాజమౌళి నుంచి కూడా ఏమన్నా బిగ్ న్యూస్ వస్తుందేమో చూడాలి.