డిసెంబర్ లో బిగ్ బాక్సాఫీస్ ఫైట్

తెలుగు సినిమాలు పండగ సీజన్ ను ఏ విధంగా క్యాష్ చేసుకుంటా యొక్క ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పండుగ సీజన్లో అయినా కాస్త క్లిక్ అయితే చాలు పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడమే కాకుండా మంచి లాభాలు వస్తాయి. టాక్ ఎలా ఉన్నా కూడా కొన్ని ఫెస్టివల్స్ అయితే సినిమాలకు చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి.

ఇక ఈసారి సంక్రాంతి కంటే ముందుగా డిసెంబర్ నెలలో చాలా సినిమాలు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతికి కొన్ని పెద్ద సినిమాలు ముందుగానే డేట్స్ బుక్ చేసుకోవడంతో డిసెంబర్ అయితే బెటర్ అని కొంతమంది హీరోలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా అయితే అందరి ఫోకస్ ఓజీ సినిమా పైనే ఉంది. ఈ సినిమా రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఆ డేట్కు రావచ్చు అని అంటున్నారు.

అలాగే వెంకటేష్ సైంధవ్ సినిమా కూడా అప్పుడే వచ్చే అవకాశం ఉంది. ఇక విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, నితిన్ ఎక్స్ స్ట్రార్డినరి మ్యాన్, నాచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ ఇలా వరుస తెలుగు సినిమాలు కూడా డిసెంబర్ క్రిస్టమస్ హాలిడేస్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు మాత్రమే క్రిస్టమస్ కు వచ్చే అవకాశం ఉంది.

మరికొన్ని ఆ తర్వాత గాని లేదా అంతకంటే ముందు వారంలో ప్రేక్షకుల ముందుకు రావచ్చు. అలాగే బాలీవుడ్ యానిమల్ సినిమా షారుక్ ఖాన్ డుంకీ సినిమా కూడా డిసెంబర్లోనే రానున్నాయి. కాబట్టి క్రిస్మస్ హాలిడేస్ ఆసక్తికరమైన సినిమాలతో సందడిగా కనిపించబోతోంది. మరి ఈ ఫెస్టివల్ లో ఏ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.