వద్దు బాబోయ్ రామాయణం.! ‘ఆదిపురుష్’ గుణపాఠం.!

రెండు రోజుల్లో రెండు వందల కోట్ల రూపాయలట.! ‘ఆదిపురుష్’ గురించి జరుగుతున్న ప్రచారమిది. డబ్బులొస్తే సరిపోతుందా.? సినిమా మీద వస్తున్న విమర్శల సంగతేంటి.? వేల సంఖ్యలో ఫ్రీ టిక్కెట్స్ ఇస్తూ, వసూళ్ళ గురించి మాట్లాడితే హాస్యాస్పదమే.

ఇక, తెలుగులో కొందరు దర్శకులు ‘రామాయణం’ను తీద్దామనుకున్నారు. వాళ్ళకిక ఆ అవకాశం వుండకపోవచ్చేమో.! ఎందుకంటే, ఈసారెవరైనా ‘రామాయణం’ పేరుతో వెకిలి సినిమాలు తీస్తే, జనం థియేటర్లను తగలబెట్టేసేలా వున్నారు.

క్రియేటివిటీకి హద్దుల్లేకుండా పోయాయ్. హద్దులంటే వెకిలితనం ఇక్కడ.! రాజమౌళి సహా కొందరు దర్శకులకు ‘రామాయణం’పై అమితమైన అభిమానం వుంది. అదిప్పుడు చచ్చిపోయింది. సినీ వర్గాల్లో ఎక్కడ విన్నా ఇదే చర్చ.

ప్రభాస్‌కి అర్థమవుతోందో లేదోగానీ.. డ్యామేజ్ చాలా చాలా గట్టిగా జరిగింది.. ఇమేజ్ పరంగా.! ‘కృష్ణంరాజు జీవించి వుంటే, ఇలా జరగనిచ్చేవారు కాదు..’ అని కొందరు దర్శకులు, నిర్మాతలు చర్చించుకుంటున్నారట.. ప్రభాస్‌ని నిందిస్తూ.!