ట్విట్టర్ రివ్యూ : “భోళా శంకర్” పరిస్థితి ఏంటి?

ఇప్పుడు టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “భోళా శంకర్” అనే చెప్పాలి. కాగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం రీమేక్ గా రావడంతో ఏమంత భారీ హైప్ లేదు.

పైగా “వాల్తేరు వీరయ్య” లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వచ్చినప్పటికీ మొదట్లో పర్లేదు కానీ నెక్స్ట్ మాత్రం ట్రైలర్ చూసాక పెద్దగా హైప్ లేకుండా పోయింది. ఇప్పుడు ఏమాత్రం హైప్ అండ్ వసూళ్లు వచ్చినా మెగాస్టార్ వల్లే అవుతుంది. ఐతే చాలా పూర్ గా స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్స్ పడిపోయాయి.

దీనితో భోళా రివ్యూ అయితే ట్విట్టర్ వేదికగా వచ్చేసింది. ఇక ఈ చిత్రానికి అయితే అనుకున్నట్టే జరిగింది. ఓ రోత రీమేక్ ని అయితే ఆడియెన్స్ కి పడేశారని చూసిన వారు అంటున్నారు. ఇప్పటికీ ఆడియెన్స్ రీమేక్స్ విషయంలో ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 

ముందు నుంచి అనుకున్నట్టే భోళా విషయంలో ఇప్పుడు ఎక్కువ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వినిపిస్తుంది. కొన్ని ఏక్షన్ బ్లాక్ లు తప్ప సినిమాలో అసలు విషయం లేదని ఇక ఆ కామెడీ అయితే చెత్తగా ఉందని అంటున్నారు. ఓవరాల్ గా ఓ డల్ సినిమా ఇది అని అంటున్నారు. కీర్తి సురేష్ పై కొన్ని ఎమోషనల్ సీన్స్ తప్ప సినిమాలో ఏమి లేదట.

ఆఖరికి బాస్ కూడా సినిమాని కాపాడలేడు అని అంటున్నారు. ఇక భోళా శంకర్ ని అయితే బాక్సాఫీస్ దగ్గర ఏ దేవుడు కాపాడుతాడో ఏంటో. డెఫినెట్ గా ఈ చిత్రానికి మెగాస్టార్ కెరీర్ లో చాలా తక్కువ ఓపెనింగ్స్ రావచ్చు. అది గాడ్ ఫాదర్ కన్నా తక్కువే ఉన్నా ఆశ్చర్యం లేదు. అసలు డే 1 కె తెలుగు స్టేట్స్ లో మొదటి షో నే హౌస్ ఫుల్స్ పడకపోవడం జరిగింది అంటే అసలు ఆడియెన్స్ ఇలాంటి చిత్రాల పట్ల ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవాలి. 


https://twitter.com/DeepakMucharla/status/1689827489714241536?s=20