“భోళా శంకర్” సెన్సార్ రిపోర్ట్..నమ్మకం లేదు దొరా.!

ఈ ఆగస్ట్  నెలలో టాలీవుడ్ నుంచి రాబోతున్న మొదటి బిగ్ రిలీజ్ మెగాస్టార్ చిరంజీవి అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా మరియు కీర్తి సురేష్ లు నటించిన లేటెస్ట్ చిత్రం “భోళా శంకర్”. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించగా ఈ సినిమా కోసం అయితే తాను చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేసాడు.

అలాగే మెగాస్టార్ కోసం మొదటి సారి సాంగ్ ని కూడా రాసి ఏదో రకంగా హైప్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంకి ఇప్పుడు ఓవర్సీస్ లో బుకింగ్స్ బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడో రీమేక్ సినిమాని హైప్ మాత్రం అందరిలో లేదు. ఓన్లీ మెగా ఫ్యాన్స్ తప్ప పెద్దగా మిగతా ఎవరూ అంత ఆసక్తి అయితే కనబరచడం లేదు.

కానీ లేటెస్ట్ గా అయితే భోళా శంకర్ సెన్సార్ రిపోర్ట్ టాక్ అంటూ ఒకటి వైరల్ గా మారుతుంది. సినిమాకి మొన్ననే సెన్సార్ కంప్లీట్ అయ్యి యూ/ ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇక సెన్సార్ యూనిట్ నుంచి అయితే ఈ చిత్రానికి అదిరే రెస్పాన్స్ వచ్చింది అని సినిమా డెఫినెట్ గా హిట్ అయిపోద్ది భారీ వసూళ్లు కూడా రాబడుతుంది అని అంటున్నారు.

అయితే అసలు ఈ టాక్ నమ్మడానికి లేదు అని చెప్పాలి. లాస్ట్ టైం కూడా చిరు “ఆచార్య” కూడా సెన్సార్ రిపోర్ట్ అంటూ పాజిటివ్ టాక్ నే బయటకి వచ్చింది. మరి మళ్ళీ ఇప్పుడు ఈ చిత్రానికి కూడా ఇలాగే వినిపిస్తుంది. దీనితో అయితే ఇది మరోసారి నమ్మేలా లేదు అని చెప్పాలి. ఇప్పటికే ఒక్క మెగా ఫ్యాన్స్ లో తప్ప మిగతా వారిలో సినిమాపై హైప్ లేదు. ఇక రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.