మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా పై ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో అయితే బజ్ అయితే క్రియేట్ కాలేదు. కానీ తప్పకుండా సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవుతుంది అని మెహర్ రమేష్ టీం గట్టిగా నమ్ముతోంది. ఇప్పటికే ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలు కూడా మొదలుపెట్టేశారు.
ఇక ఇంతకుముందు సినిమాకు సంబంధించిన టీజర్ తో పాటు సాంగ్స్ కూడా విడుదల చేశారు. కానీ అవన్నీ అంతగా క్లిక్ కాలేదు. ఇక ఇటీవల వచ్చిన ట్రైలర్ మాత్రం బాగానే వర్కౌట్ అయింది. కానీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడానికి అది సరిపోదు. ఇక సినిమా విడుదల తర్వాత టాక్ ను బట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశం అయితే ఉంది.
అయితే అంతకంటే ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ సినిమాకు ఒక మంచి ఛాన్స్ అన్న చెప్పాలి. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సినిమాపై మరింత అంచనాలు పెంచాలి అని మెగా టీం ఆలోచిస్తుంది. ఇక ఈ వీకెండ్ లోనే ఈవెంట్ ను ప్లాన్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నా విషయం తెలిసిందే.
ఇక ఆంధ్రప్రదేశ్ విజయవాడ లో భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ వేడుకకు అతిథిగా ఎవరైనా వస్తారా లేదంటే మెగాస్టార్ నాయకత్వంలోనే ఈవెంట్ కొనసాగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతోనే డైరెక్టర్ మెహర్ రమేష్ సక్సెస్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. అలాగే నిర్మాత అనిల్ సుంకర కూడా బిగ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.