భాగ్యశ్రీ.. 1989లోమైనే ప్యార్ కియా అనే హిందీ సినిమాతో హిందీ చిత్రరంగంలో అడుగు పెట్టారు. ఇదే సినిమాను తెలుగులో ప్రేమ పావురాలుగా డబ్ అయింది. తొలి సినిమాతోనే ఆమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత హిందీలో పాటు కన్నడ, తెలుగు, బెంగాలీ, భోజ్ పురి, మరాఠీ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇప్పటికీ ఆమె హీరోయిన్ గా కొనసాగింది. రాధేశ్యామ్, తలైవి చిత్రంలోనూ మెరిసింది.
అయితే హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఆమె హిమాలయ దాసాని అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు కుమారులు, ఓ కూతురు కూడా పుట్టారు. అయితే పెళ్లి, పిల్లల పుట్టిన తర్వాత కూడా భర్త అంగీకారంతో ఆమె సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె 2001లో ఆంకియోంకే జారకోన్ సే సినిమాలో నటించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ శోభనం సీన్ నటించడానికి భాగ్య శ్రీ చాలా ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని ఆ సినిమాలో హీరోగా చేసిన సమీర్ సోనినే నేరుగా మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఆయన మాట్లాడుతూ… ఆ సినిమాలో తామిద్దరూ లవర్స్ గా కనిపించినట్లు వివరించారు. అయితే ఇందులో భాగ్య శ్రీ అంధురాలిగా నటించిందట. ఓ రోజు శోభనం సీను షూటింగ్ జరుగుతుండగా… డైరెక్టర్ ఈ సీన్ కోసం మంచి ఫ్రేమ్ సెట్ చేసి పెట్టారట.
ఆ సీనులో భాగంగా తాను ఆమె దగ్గరకు వెళ్లగా.. తను మాత్రం పక్కకు జరుగుతూ ఉందట. ఇలా చాలా సార్లు జరిగిందట. అప్పటికే చాలా టేకులు తీసుకున్నారట. తనకేం జరుగుతుందో కూడా అర్థం కాలేదట. అయితే భాగ్యశ్రీ అంధురాలు కాబట్టి ఆయన ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు ఆమె కదలకూడదట. కానీ కదులుతుండడంతో ఇబ్బంది ఏర్పడిందని సమీర్ సోని చెప్పారు. ఆ తర్వాత ఆమె అతడి వద్దకు వచ్చి ఈ సీన్ తాను చేయలేకపోతున్నట్లు చెప్పిందట.
తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. తాను ఇలాంటి సీన్లలో కనిపిస్తే వాళ్లు ఎలా ఫీలవుతారోనని భయపడినట్లు చెప్పిందని అన్నారు. ఇదే విషయాన్ని మీరు డైరెక్టర్ కు చెప్పమని తాను సలహా ఇస్తే ఆమె దర్శకుడికి చెప్పి ఆ సీన్ తీసేయించుకుందట. ఎన్నో పాత్రల్లో అద్భుతంగా నటించే ఆమె శోభనం సీన్ లో నటించేందుకు మాత్రం చాలా ఇబ్బంది పడినట్లు వివరించారు.