వైరల్ : “ఛత్రపతి” హిందీ టీజర్ మైండ్ బ్లోయింగ్ అంతే.!

ఇప్పుడు ఉన్న టీం లో కొన్ని రీమేక్ సినిమాలు పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉందో తెలిసిందే. ఇప్పుడు ఉన్న ఓటిటి ప్రపంచంలో అయితే ఎంతమంది స్టార్ లు తీసినా అవి హిట్ టాక్ తెచ్చుకున్నా వసూళ్లు యావరేజ్ గానే నమోదు అవుతున్నాయి.

అయితే ఈ రీమేక్స్ కి అతీతంగా సెన్సేషనల్ గా మారిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి రాబోతున్న మన తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీను నటించిన “ఛత్రపతి” రీమేక్ అని చెప్పాలి. మరి దీని ఒరిజినల్ కోసం తెలుగు ఆడియెన్స్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరి ఈ సినిమాని అనౌన్స్ చేసిన సమయంలో ఎన్నో ట్రోల్స్ పడ్డాయి కానీ ఇప్పుడు వచ్చిన టీజర్ చూస్తే మాత్రం ఒకొక్కరికి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అని చెప్పాలి. దర్శకుడు వివి వినాయక్ ఒరిజినల్ ని అచ్చు దింపేసినప్పటికీ కొత్తగా ఇది కనిపించడం అనేది ఆశ్చర్యం.

అయితే ఈరోజు నాచురల్ స్టార్ నాని దసరా సినిమాతో హిందీ బెల్ట్ లో థియేటర్స్ లో చప్పుడు లేకుండా రిలీజ్ చేశారు. దీనితో ఈ వీడియో బయటకి రాగా ఇలా థియేటర్ ప్రింట్ వీడియో లోనే చూస్తే ఇలా ఉంటే ఇక అఫీషియల్ గా రిలీజ్ చేసేది ఏ లెవెల్లో ఉంటుందో అని చాలా మంది అనుకుంటున్నారు.

ముఖ్యంగా ఏక్షన్ గాని ఎలివేషన్స్ గాని మాములుగా అనిపించట్లేదు. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు ఒక్కసారిగా అంచనాలు పెంచుకోగా ఈ టీజర్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారిపోయింది.