డైనమిక్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ, ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘ఛత్రపతి’ తో బాలీవుడ్‌లో గ్రాండ్ డెబ్యూ చేస్తున్నాడు. రాజమౌళి బ్లాక్‌బస్టర్ ఛత్రపతికి రీమేక్ గా అదే టైటిల్ తో ఈ చిత్రాన్ని గ్రాండ్ తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.
ఈ సినిమా పవర్ ప్యాక్డ్ టీజర్ భారీ బజ్‌ని క్రియేట్ చేసింది. మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో పొరుగు దేశంలో అల్లర్ల తర్వాత పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన తన తల్లి, తమ్ముడి కోసం వెతుకుతుంటాడు. అతను తన ప్రజల హక్కుల కోసం పోరాడటానికి పవర్ ఫుల్ వ్యక్తులకు వ్యతిరేకంగా వెళ్తాడు. తల్లి తుపాకీతో కథానాయకుడిని కాల్చి చంపడం తో ట్రైలర్ పూర్తయింది.
సినిమా బ్యాక్‌డ్రాప్‌ని మార్చి దర్శకుడు వివి వినాయక్ ఛత్రపతిని యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. యాక్షన్ ధమకేదార్ ట్రైలర్ మాస్ కి పండగలా వుంది. టైటిల్ రోల్‌లో శ్రీనివాస్ బెల్లంకొండ రగ్డ్ అండ్ మాస్‌గా కనిపించాడు. తన పాత్రని చాలా యీజ్ తో చేశారు. ఎమోషనల్ సీన్స్‌లోనూ అద్భుతంగా నటించాడు. తల్లీ కొడుకుల ఎమోషన్ ఆకట్టుకున్నాయి. నుష్రత్ భరుచ్చా హీరోయిన్ పాత్రలో గ్లామరస్‌గా కనిపించింది.
నిజార్ అలీ షఫీ సినిమాటోగ్రఫీ అత్యున్నతంగా ఉంది. తనిష్క్ బాగ్చి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మాస్ , యాక్షన్ సైడ్‌ని ఎలివేట్ చేసింది. పెన్ స్టూడియస్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
విమర్శకుల ప్రశంసలు పొందిన, కమర్షియల్ గా విజయవంతమైన చిత్రాలను రూపొందించడంలో పేరుపొందిన పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ధవల్ జయంతిలాల్ గడా ,అక్షయ్ జయంతిలాల్ గడా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు. భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మిస్తున్నారు.
ఒరిజినల్‌కి కథను అందించిన రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్ రీమేక్ వెర్షన్‌కి రచయిత. భారతదేశంలోనే అత్యంత బిజీ టెక్నీషియన్లలో ఒకరైన సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రానికి మయూర్ పూరి డైలాగ్స్ అందిస్తున్నారు.
తారాగణం: శ్రీనివాస్ బెల్లంకొండ, నుష్రత్ బరుచ్చా, సాహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్, మహ్మద్ మోనాజీర్, ఔరోషికా డే, వేదిక, జాసన్
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: వివి వినాయక్
కథ: కెవి విజయేంద్ర ప్రసాద్
సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గడా
నిర్మాతలు: ధవల్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా
బ్యానర్లు: పెన్ స్టూడియోస్
వరల్డ్ వైడ్ విడుదల: పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్
దీవోపీ : నిజార్ అలీ షఫీ
స్టంట్ మాస్టర్: అన్ల్ అరుసు
సంగీతం: తనిష్క్ బాగ్చి
డైలాగ్స్: మయూర్ పూరి
ప్రొడక్షన్ డిజైనర్: సునీల్ బాబు
ఆర్ట్ డైరెక్టర్: శ్రీను
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చా మెహతా
అసోసియేట్ డైరెక్టర్: సఫ్దర్ అబ్బాస్