Rajamouli :ఆర్ఆర్ఆర్ ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న సినిమా జనవరిలోనే విడుదల కావాల్సినా కరోనా వల్ల వాయిదా పడి చివరకు మార్చి 25నా విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా ఆలియా సీత గా కనువిందుచేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లు సినిమా మీద అంచనాలను బాగా పెంచాయి. ఇద్దరి హీరోల అభిమానులు ఉత్కంఠంగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా ను ముందు జనవరిలో విడుదల చేయాలనుకోవడంతో ప్రొమోషన్స్ బాగా చేసారు. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రముఖ షోలలో పాల్గొన్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్. ఇపుడు ఇక ఆలియా ప్రొమోషన్స్ కి దూరంగా ఉండనుంది. ఇక చిత్ర యూనిట్ ఒక పాటను మార్చి 14 నా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఎత్తరా జెండా ‘ అనే దేశభక్తి గీతాన్ని విడుదల చేయబోతున్నారు.
ఇక వరుస ఇంటర్వ్యూలతో రాజమౌళి ప్రొమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లారు.ఇటీవల ఒక గల్ఫ్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇంత వరకు ఎందుకు ఆయన సినిమా ఒకటి కూడా ప్లాప్ అవ్వలేదని అడుగగా రాజమౌళి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. భయం నన్ను విజయానికి దగ్గర చేస్తోందని చెప్పాడు. ప్రతి సినిమాకు ముందు సినిమా విజయవంతం అవడంతో కొత్త సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతాయని అందుకోసం ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం ఉండేలా కష్టపడుతూనే అంచనాలను చేరడం కోసం భయపడుతుంటానని చెప్పారు. ఓటమి అనే భయం వెంటాడుతుంటుంది కాబట్టి సినిమా మీద పెద్ద కలలు కంటానని అందుకోసం కష్టపడతానని చెప్పారు జక్కన్న. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25 న గ్రాండ్ గా విడుదలకు ప్లాన్ చేసారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ చిత్రం చూడాలి రాజమౌళి కష్టానికి ఎంత ప్రతిఫలం ఇస్తుందో.