బండ్ల గణేష్ అంటే ఏంటో ఆయన ఎలా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే. ఓ ఊపులో ఉన్నాడంటే ఏం మాట్లాడాతాడో ఆయనకే తెలియదు. ఎంత దూరమైనా మాట్లాడేస్తాడు. అది మంచైనా గానీ చెడైనా గానీ. ఫటా ఫట్ మాట్లాడేస్తుంటాడు. ముందు వెనుకా చూసుకోడు. అయితే సినిమా ఈవెంట్లలో, ఆడియో ఫంక్షన్‌లలో మాట్లాడటం వేరు. రాజకీయ ప్రసంగాలలో మాట్లాడటం వేరు. టీవీలో లైవ్ డిబెట్లలో మాట్లాడటం వేరు. రాజకీయంగా మంచి ఊపులో ఉన్న సమయంలో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే.
ఒకసారి రోజాతో లైవ్‌లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, వారిద్దరి వాగ్వాదం ఏ రేంజ్‌లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, నువ్ అతనికి పక్కలేసేవాడివి అంటూ రోజా బండ్ల గణేష్‌ను దారుణంగా తిట్టింది. ఇక బండ్ల గణేష్ కూడా ఏమీ తక్కువ తినలేదు అక్కడే లైవ్‌లో రోజా పరువు తీసేశాడు. రా నిన్ను కూడా తీసుకెళ్లా అంటూ ఘోరంగా అనేశాడు. ఇలా వీరిద్దరి మాటల యుద్దం రెండు తెలుగు రాష్ట్రాల్లొ ప్రకంపనలు సృష్టించింది.
ఆ తరువాత బండ్ల గణేష్ రాజకీయాలకు దూరంగా రావడం, మొత్తం చల్లబడటం జరిగింది. కరోనా సోకడం, దాన్నుంచి కోలుకోవడంతో పూర్తిగా మారిపోయాడు. ఒకప్పటి బండ్ల గణేష్ వేరు ఇప్పుడున్నది వేరు అంటూ శాంతస్వరూపుడిగా మారిపోయాడు. ఇలా గొడవలు పెట్టుకుంటూ పోవద్దు.. వీలైతే అందరినీ కలుపుకుపోవాలి అనే సిద్దాంతాన్ని పాటిస్తున్నాడు. దానికి నిదర్శనమే తాజాగా ఆయన రోజాతో దిగిన ఫోటో. చాలా రోజుల తరువాత రోజాను కలిశాను.. ఆమెకు విజయం, ఆరోగ్యం, సంపద కలగాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.