హాట్ టాపిక్ గా బాలయ్య, శ్రీలీల ల సాంగ్.!

ఇప్పుడు టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా పలు చిత్రాలు ఓకే చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో అయితే దర్శకుడు అనీల్ రావిపూడి తో చేస్తున్న ఓ పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రమే “భగవంత్ కేసరి”. కాగా ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో శరవేగంగా కంప్లీట్ చేసుకుంటూ ఉండగా..

ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా రీసెంట్ టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఈ చిత్రంలో బాలయ్యకి కూతురు పాత్రలో కనిపించనుంది అని టాక్ ఉంది. అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ సీన్ వర్గాల్లో ఈ చిత్రంలో బాలయ్య మరియు శ్రీలీల లపై ఓ మాస్ సాంగ్ కోసమే హాట్ టాపిక్ గా చర్చ నడుస్తుంది.

కాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో థమన్ ఒక పవర్ ఫుల్ మాస్ నెంబర్ ని డిజైన్ చేయగా ఈ ట్యూన్ కి అయితే బాలయ్య శ్రీ లీల ఇద్దరు అదరగొట్టేసారు అని అలాగే ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఐతే తెలుగు రాష్ట్రాల మాస్ ఆడియెన్స్ లో మారు మోగిపోతుంది అని అంటున్నారు. మరి శ్రీ లీల ఎనర్జీ కోసం చెప్పక్కర్లేదు.

సరైన సాంగ్ పడితే ఓ డైనమైట్ లా పేలుతుంది. అలాగే బాలయ్య ఈ ఏజ్ లో కూడా పలు క్లిష్టమైన స్టెప్పులు కూడా అలవోకగా వేసేస్తున్నారు. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ లో వచ్చే ఆ పాట ఏంటో ఎలా ఉంటుందో చూడాల్సిందే. కాగా ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ లో సినిమా రిలీజ్ కాబోతుంది.