ప్రోమో టాక్ : రష్మికతో బాలయ్యే హైలైట్..!

తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహా లో ఇప్పుడు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓ వైల్డ్ ఎపిసోడ్ కి ఫైనల్ గా టైం వచ్చింది. ఒక పక్క మాస్ లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇంకోపక్క టాలీవుడ్ వైల్డ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన కొత్త చిత్రం “ఆనిమల్” టీం తో ప్లాన్ చేసిన ఎపిసోడ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

ఐతే ఈ ఎపిసోడ్ లో దర్శకుడు సందీప్ మొట్ట మొదటిసారిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హాజరు కావడం బిగ్గెస్ట్ హైలైట్ కాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఇందులో హాజరు అయ్యింది. అయితే రష్మిక వచ్చిన తర్వాత బాలయ్య ఇద్దరు రొమాన్స్ మాత్రం మామూలు లెవెల్లో లేదని చెప్పాలి.

స్టేజి మీదనే ఇద్దరూ డాన్స్ స్టేజి మీదనే ఆమె లవ్ యు చెప్పడం వంటివి కేజ్రీగా మారాయి. పైగా విజయ్ దేవరకొండ తో కాల్ లో ఉన్నపుడే చెప్పడం ఏదైతే ఉందో అది ప్రోమోలో ఇంకో హైలైట్ అని చెప్పాలి. కాగా హీరో రణబీర్ కపూర్ మాత్రం కాస్త నెమ్మదిగానే ఉన్నాడు కానీ బాలయ్య పైసా వసూల్ సాంగ్ కి బాలయ్యతో కలిసి స్టెప్ ఎయ్యడం లాస్ట్ లో బాలయ్య ఫేమస్ డైలాగ్ డోంట్ ట్రబుల్ డైలాగ్ చెప్పి బాలయ్యని ఆశ్చర్యపరిచాడు.

ఇక దర్శకుడు సందీప్ ని అయితే బాలయ్య తన మార్క్ లో ఆట పట్టించడంతో ఎపిసోడ్ మాత్రం ఓ రేంజ్ లో ఉండేలా అర్ధం అవుతుంది. దీనితో ఈ ప్రోమో చూసాక ఎపిసోడ్ కోసం మరింతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ అవైటెడ్ ఎపిసోడ్ ఆహాలో ఈ నవంబర్ 24 నుంచి లేదా ఇంకా ముందే స్ట్రీమింగ్ కి రానుంది. 
Unstoppable With NBK Episode Promo | Ranbir, Rashmika | Wildest Episode on Nov 24🔥